ENGLISH

దిల్‌ రాజును టెన్షన్‌ పెట్టేస్తున్న ఆ యంగ్‌హీరో

19 July 2018-11:04 AM

రాజ్‌తరుణ్‌, రిథీ కుమార్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'లవర్‌'. దిల్‌రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. 'అలా ఎలా?' ఫేం అనీష్‌ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కాగా ఎందుకో ఈ సినిమా విషయంలో దిల్‌రాజు చాలా టెన్షన్‌ పడుతున్నాడట. 

అభిరుచి గల చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు దిల్‌రాజు. ఫ్యామిలీ ఎమోషన్స్‌, యూత్‌ పల్స్‌ బాగా తెలిసినోడు. అలాంటిది ఈ మధ్య చిన్న సినిమాల జోలికి పోవాలంటే కాస్త టెన్షన్‌ పడుతున్నాడట. దీనికి కారణం ఈ మధ్య సినిమాలు ఎందుకు హిట్‌ అవుతున్నాయో, ఎందుకు ఫ్లాప్‌ అవుతున్నాయో తెలీడం లేదు. సినిమాలో కంటెన్ట్‌ ఉంటే ఎలాంటి సినిమా అయినా హిట్‌ అయ్యి తీరుతుంది అనుకోవడానికి లేదిప్పుడు. అదే దిల్‌ రాజు భయానికి కారణమేమో అనిపిస్తోంది. 

ఈ మధ్య రాజ్‌తరుణ్‌కి లక్‌ అంతగా కలిసి రావడం లేదు. మొదట్లో హ్యాట్రిక్‌ హీరోగా జోరు చూపించిన రాజ్‌తరుణ్‌ ఇప్పుడు కుదేలైపోయాడు. ఈ మధ్య రాజ్‌తరుణ్‌కి చెప్పుకోదగ్గ హిట్‌ పడలేదు. ఈ తరుణంలో వస్తున్న 'లవర్‌' సినిమా విషయంలో దిల్‌ రాజు టెన్షన్‌ పడడం న్యాయమే అనిపిస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో ప్రమోషన్‌ హడావిడి కూడా జోరుగానే చేస్తున్నాడు దిల్‌రాజు. ప్రోమోస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌నీ, లవ్‌ ఎమోషన్స్‌నీ మిక్స్‌ చేసి బాగానే వదులుతున్నారు. 

చూడాలి మరి రాజ్‌తరుణ్‌ 'లవర్‌'తో ఏం చేస్తాడో.!

ALSO READ: బాబు-గణేష్ ల 'ఒరేయ్ ఉప్మా'