ENGLISH

Dil Raju: షూటింగులు బంద్ .. 'మా'తో దిల్ రాజు

04 August 2022-13:35 PM

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా అధ్యక్షుడు మంచు విష్ణును నిర్మాత దిల్‌రాజు కలిశారు. మంచు విష్ణు కార్యాలయానికి వెళ్లిన దిల్‌రాజు ఆయనతో కొద్దిసేపు సమావేశమయ్యారు. తమ సినిమాల్లో ‘మా’ సభ్యులకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలని, అలాగే, కొత్తవారు ‘మా’లో భాగమయ్యేలా ప్రోత్సహించాలని దిల్‌ రాజుని విష్ణు కోరారు. ఈ మేరకు ‘మా’ సంక్షేమ కమిటీ వినతి పత్రాన్ని దిల్‌రాజుకు అందించారు.

 

కాగ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలని పరిష్కరించాలని ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను స్వచ్చందంగా నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయిం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్మాణ వ్యయం , టికెట్ రేట్లు, ఓటీటీ విడుదల, ఫెడరేషన్ సమస్యలు , వర్కర్స్ వేతనాలు ఇలా అనేక సమస్యలపై హీరోలు, దర్శకులు, నటీనటులు, 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ అందరితోనూ సమిష్టిగా చర్చించి, పరిశ్రమకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు , విష్ణు ని కలిశారని తెలుస్తోంది.

ALSO READ: ప్ర‌భాస్ చెప్పాడు... సీతారామం థియేట‌ర్ల‌న్నీ నిండిపోవాల్సిందే!