ENGLISH

Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఆశలన్నీ 'బింబిసార'పైనే

04 August 2022-12:30 PM

'పటాస్' తర్వాత కళ్యాణ్ రామ్ కి మరో సరైన విజయం లేదు. చాలా నమ్మకంతో చేసిన పూరి జగన్నాధ్ ఇజం కూడా నిరాశపరిచింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కి మాంచి విజయం కావాలి. ఆ విజయం బింబిసారతో దక్కుతుందని నమ్మకంగా వున్నారు కళ్యాణ్ రామ్. బింబిసార మార్కెట్ లెక్కలు వేసుకోకుండా చాలా ఖర్చుతో నిర్మించారు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. ప్రమోషన్ మెటీరియల్ క్యూరియాసిటీని పెంచింది. సినిమాపై పాజిటివ్ వైబ్స్ వున్నాయి.

 

నిజానికి బింబిసార విజయంపై కళ్యాణ్ రామ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆధారపడివున్నాయి. కళ్యాణ్ రామ్ కి సొంతగా నిర్మాణ సంస్థ వున్న సంగతి తెలిసిందే. బింబిసారని ఆయనే స్వయంగా నిర్మించారు. ఈ సినిమా విజయం సాధిస్తే కనుక సీక్వెల్స్ ని కొనసాగించే అవకాశం వుంది. అంతేకాదు.. తన నిర్మాణంలో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ కి శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు కావాల్సిందల్లా బింబిసార విజయం కావడం. బింబిసార కనుక ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే కళ్యాణ్ రామ్ నుండి మరిన్ని భారీ సినిమాలు వచ్చే ఖచ్చితంగా వుంది.

ALSO READ: ప్ర‌భాస్ చెప్పాడు... సీతారామం థియేట‌ర్ల‌న్నీ నిండిపోవాల్సిందే!