ENGLISH

క్రిష్ సినిమా క‌ల్యాణ్ రామ్‌తోనా??

11 March 2017-12:31 PM

గౌత‌మిపుత్ర శాత‌కర్ణితో ఓ మ‌ర్చిపోలేని విజ‌యాన్ని బాక్సాపీసుకి అందించాడు క్రిష్‌. ఆయ‌న త‌దుప‌రి సినిమా ఏంట‌న్న విష‌యంలో క‌న్‌ఫ్యూజ‌న్ నెల‌కొంది. వెంక‌టేష్‌తో ఓ సినిమా అనుకొన్నారు గానీ, అది లాస్ట్ మినిట్‌లో ఆగిపోయింది. బాలీవుడ్‌లో ఓ సినిమా చేయాల్సింది.కానీ... క్రిష్ దాన్నీ ప‌క్క‌న పెట్టేశాడ‌ని టాక్‌. ఈమ‌ధ్య క్రిష్ క‌ల్యాణ్ రామ్‌ని క‌లుసుకొని రావ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. కల్యాణ్ రామ్‌తో క్రిష్ ఓ సినిమా చేసే అవ‌కాశాలున్నాయ‌ని, ఇద్ద‌రి మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్న టాక్ వినిపిస్తోంది. క‌ల్యాణ్ రామ్ ఫామ్‌లో లేడు. `ఇజం` సినిమాతో బాగా దెబ్బ‌తిన్నాడు. క్రిష్ కోరుకొంటే అగ్ర హీరోలు త‌న‌తో ప‌నిచేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. కానీ.. తాను మాత్రం క‌ల్యాణ్ రామ్ కోసం క‌థ‌ని త‌యారు చేసుకోవ‌డం.. ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌య‌మే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుందా??  వెయిట్ అండ్ సీ.