ENGLISH

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు నిరాశ త‌ప్ప‌దా?

11 March 2017-11:39 AM

పెద్ద హీరో సినిమా విడుద‌ల అవుతోందంటే.. బినిఫిట్ షోల హంగామా క‌నిపిస్తుంటుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాల‌కు అర్థ రాత్రి షోల హంగామా కంప‌ల్స‌రీ. అయితే... ప‌వ‌న్ కాల్యాణ్ తాజా చిత్రం కాట‌మ‌రాయుడు కి మాత్రం బెనిఫిట్ షోలు ప‌డే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఈనెల 24న కాట‌మ‌రాయుడు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. 23 అర్థ‌రాత్రి బెనిఫిట్ షోల కోసం... అప్పుడే పైర‌వీలు మొద‌లైపోయాయి. కానీ.. చిత్ర‌బృందం మాత్రం బెనిఫిట్ షోల విష‌యంలో ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌కి కావ‌ల్సిన‌న్ని చోట్ల‌... బెనిఫిట్ షోల‌కు అనుమ‌తులు ఇచ్చేశారు. అయితే... ఆసినిమా ఫ్లాప్ అవ‌డం, తెల్లారేస‌రికి టాక్ తెలిసిపోవ‌డంతో.. నెగిటీవ్ టాక్ బాగా స్పైడ్ అయ్యింది. ఆ అవ‌కాశం ఈసారి ఇవ్వ‌కూడ‌ద‌ని చిత్ర‌బృందం భావిస్తుందేమో..??  సో.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఈసారి నిరాశ త‌ప్ప‌క‌పోవొచ్చు.