ENGLISH

కాట‌మ‌ రాయుడు... శాటిలైట్ సోల్డ్ అవుట్‌

10 March 2017-18:54 PM

ప‌వ‌న్ సినిమా అంటే బాక్సాఫీసు ద‌గ్గ‌ర సంద‌డే సంద‌డి. విడుద‌ల‌కు ముందే రికార్డులు బ్రేక్ అవుతాయి. కాట‌మ‌రాయుడు విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫ్లాప్ అయినా.. ఆ ప్ర‌భావం కాట‌మ‌రాయుడ‌పై ఏమాత్రం ప‌డ‌లేదు. అందుకే కాట‌మ‌రాయుడు టీజ‌ర్‌, పాట‌ల‌కు వ‌స్తున్న స్పంద‌నే నిద‌ర్శ‌నం. తాజాగా శాటిలైట్‌లోనూ కాట‌మ‌రాయుడు స‌త్తా చూపించాడు. జెమినీ టీవీ కాట‌మ‌రాయుడు శాటిలైట్‌ని కైవ‌సం చేసుకొంది. దాదాపు రూ.12.5 కోట్ల‌కు శాటిలైట్ హ‌క్కులు అమ్ముడుపోయాయ‌ని స‌మాచారం. స‌ర్దార్ గబ్బ‌ర్ సింగ్ ఫ్లాప్ అయినా... వీర‌మ్ సినిమాకి ఇది రీమేక్ అయినా... ప‌వ‌న్ సినిమాకి ఉన్న క్రేజ్ త‌గ్గ‌క‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఓ రీమేక్ సినిమా శాటిలైట్ హ‌క్కులు ఈ స్థాయిలో అమ్ముడుపోవ‌డం కూడా ఓ రికార్డే.

ALSO READ: అంజలి 'చిత్రాంగద' రివ్యూస్ చూసి షాక్ అవ్వాల్సిందే!