ENGLISH

మహేష్‌, మురుగదాస్‌ 'ఆన్‌ ది వే'

10 March 2017-18:45 PM

మహేష్‌ - మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించి ఒక్క లుక్‌ కూడా బయటికి రాలేదు. త్వరలోనే అభిమానులు ఆశించినట్టుగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తామంటూ ఈ మధ్యే మురుగదాస్‌ ప్రకటించారు. అయితే తాజాగా ఓ లుక్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. అదే మహేష్‌ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ అంటున్నారు. అంటే దాదాపు మహేష్‌ లుక్‌ బయటికి వచ్చేసినట్లే అనిపిస్తోంది. సినిమా సెట్స్‌లో మహేష్‌ని సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ ఫొటో తీశాడు. ఆ ఫొటోని సోషల్‌ మీడియాలో పెట్టాడు. దాన్ని షేర్‌ చేస్తూ, దర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌ 'ఆన్‌ ది వే' అని హింట్‌ ఇచ్చాడు. అంటే మురుగదాస్‌ చెప్పినట్లే అతి త్వరలో సినిమా ఫస్ట్‌ లుక్‌ రాబోతోందనే అర్ధం చేసుకోవచ్చు. అయితే అంతకన్నా ముందే వచ్చేసిన ఈ లుక్‌ని చూస్తే ఆల్రెడీ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసిందనుకోవాలి. ఈ సినిమాలో మహేష్‌ సరసన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'సంభవామి' సహా పలు టైటిల్స్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. అయితే ఇంతవరకు టైటిల్‌ కన్‌ఫామ్‌ చేయలేదు చిత్ర యూనిట్‌. అత్యంత భారీ బడ్జెట్‌తో పవర్‌ ఫుల్‌ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మురుగదాస్‌ చిత్రాల్లో సహజంగా ఉండే మంచి మెసేజ్‌తోనూ, అదే విధంగా దేశభక్తికి సంబంధించిన అంశాలతోనూ ఈ సినిమా రూపొందుతోంది. 'ఆన్‌ ది వే' అంటే ఉగాది కానుక అనుకోవచ్చేమో మురుగదాస్‌ క్లారిటీ ఇస్తాడా? 

ALSO READ: రోగ్ తెలుగు వెర్షన్ డేట్ ఫిక్స్