ENGLISH

కోటికి చేరువవుతున్న 'కాటమరాయుడు'

10 March 2017-18:39 PM

రికార్డుల రారాజు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తాజా సినిమా 'కాటమరాయుడు' ఇప్పుడు సరికొత్త రికార్డులకు వేదికైంది. యూట్యూబ్‌ సాక్షిగా 'కాటమరాయుడు' టీజర్‌ సంచలనాలు సృష్టించింది. తాజాగా ఈ సినిమా నుండి రెండు పాటలు విడదలయ్యాయి. ఇవి కూడా సంచలన రికార్డులు సృష్టిస్తుండగా, తాజాగా యూ ట్యూబ్‌లో 'కాటమరాయుడు' మరో రికార్డ్‌ దిశగా అడుగులేస్తున్నాడు. అతి త్వరలో 'కాటమరాయుడు' టీజర్‌ కోటి వ్యూస్‌ దాటనుంది. ప్రస్తుతానికి 98.5 లక్షల వూస్‌ సాధించిందిది. 'మిరా మీరా సాంగ్‌'కీ అదిరే వ్యూస్‌ వస్తున్నాయి. ఇప్పటికే 36 లక్షలకు చేరుకుంది ఈ పాట. లేటెస్ట్‌గా వచ్చిన లాగే లాగే పాటకి అప్పుడే 12 లక్షల వ్యూస్‌ దాటేశాయి. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తోంది. ఇక సినిమా విడుదలైతే ఇక రికార్డుల మోత ఏ రేంజ్‌లో ఉండబోతోందో అంటూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవర్సీస్‌లో కూడా 'కాటమరాయుడు' దున్నేస్తున్నాడు. శృతిహాసన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఇద్దరి జంట చూడ ముచ్చటగా అలరిస్తోంది. తమిళ్‌ 'వీరమ్‌'కి తెలుగు రీమేకే ఈ సినిమా. ఈ సినిమాలో పవర్‌ స్టార్‌ సరికొత్త గెటప్‌తో అలరించనున్నారు. ఫ్యాన్స్‌ మెచ్చే డైలాగులు, యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోనున్నాయట ఈ సినిమాలో. అనూప్‌ రూబెన్స్‌ అందించిన బాణీలలో రెండు పాటలు ఇప్పటికే అభిమానుల్ని అలరిస్తున్నాయి. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. 

ALSO READ: రోగ్ తెలుగు వెర్షన్ డేట్ ఫిక్స్