ENGLISH

బుల్లితెర మెగాస్టార్‌ డైరెక్షన్‌లో ఆ హీరో!

10 March 2017-18:35 PM

బుల్లితెరపై సీరియల్స్‌, ఇతరత్రా ప్రోగ్రాంస్‌తో పాపులరయిన నటుడు ప్రభాకర్‌. ప్రభాకర్‌కి సినిమా రంగంతో కూడా సత్సంబంధాలున్నాయి. గీతా ఆర్ట్‌లో కూడా ప్రభాకర్‌ కొంత కాలం పని చేశాడు. అప్పట్నుంచీ డైరెక్టర్‌ కావాలని చాలా ప్రయత్నాలు చేశౄడు. అల్లు శిరీష్‌తో తన డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలనుకున్నాడు కానీ కుదరలేదు. తాజాగా సాయికుమార్‌ తనయుడు ఆది హీరోగా ఈ 'బుల్లితెర మెగాస్టార్‌' ప్రభాకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. గీతా ఆర్ట్స్‌, యువి క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా 'వి4' అనే బ్యానర్‌ని ఏర్పాటు చేశాయి. ఈ బ్యానర్‌లో ఆది హీరోగా తొలి సినిమా నిర్మించబోతున్నారు. ప్రభాకర్‌కి ఎప్పట్నుంచో ఉన్న డైరెక్షన్‌ కోరిక ఈ సినిమాతో తీరనుంది. బుల్లితెరపై ఒకప్పుడు స్టార్‌ యాక్టర్‌ అనిపించుకున్నాడాయన. నటుడిగానే కాకుండా ప్రభాకర్‌ పర్యవేక్షణలో చాలా సీరియల్స్‌ రూపొందాయి కూడా. ఈటీవీలో ఒకప్పుడు ప్రభాకర్‌ పేరు మారుమోగిపోయేది. అలాగే పలు సినిమాల్లోనూ ప్రభాకర్‌ నటించాడు. ముందుగా శిరీష్‌తో సినిమా చేయాలనుకున్నా, ప్రభాకర్‌ కోరిక ఆది హీరోగా రూపొందే సినిమాతో తీరనుంది. ఆది కొత్త సినిమాకి దర్శకుడిగా ప్రభాకర్‌ పేరు దాదాపుగా ఖరారయ్యింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది. 

 

ALSO READ: సిద్ధిపేట జిల్లాలో సమంతా హల్చల్