ENGLISH

విజ‌య్ కుమార్ కొండాకు చేదు అనుభ‌వం

07 March 2017-22:29 PM

గుండెజారి గల్లంత‌య్యిందే దర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండాకు ఓ చేదు అనుభ‌వం ఎదురైంది. ఓ మహిళ ఆయ‌న చంప ఛెళ్లుమ‌నిపించింది. హైద‌రాబాద్ ఎస్‌.ఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ముందే ఈ ఘ‌న‌ట చోటు చేసుకొంది. వివ‌రాల్లోకి వెళ్లే... విజ‌య్‌కుమార్ కొండా అన‌న్య అనే అమ్మాయిని ఇటీవ‌ల రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకొన్నార్ట‌. మా అమ్మాయిని మోసం చేసి బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకొన్నారంటూ పెళ్లి కూతురు త‌ల్లిదండ్రులు ఎస్‌.ఆర్ న‌గ‌ర్ పోలీసుల్ని ఆశ్ర‌యించారు. పోలీసులు ఫోను చేసి విజ‌య్ కుమార్‌ని స్టేష‌న్‌కి ర‌ప్పించారు. ఆ స‌మ‌యంలో అన‌న్య కూడా విజ‌య్ కుమార్‌తో వ‌చ్చింది. పోలీస్ స్టేష‌న్ బ‌య‌ట విజ‌య్‌కుమార్ కొండాకూ, అన‌న్య కుటుంబ స‌భ్యుల‌కూ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. కోపోద్రేకాల‌కు లోనైన అన‌న్య త‌ల్లి చెప్పు తీసుకొని విజ‌య్ కుమార్ కుమార్ పై దాడికి దిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వ‌ర్గాల్నీ స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.