ENGLISH

'డర్టీ హరి' సినిమాలో అసలేముంది.?

16 December 2020-10:00 AM

బాలీవుడ్‌లో 'డర్టీ పిక్చర్‌' సినిమా వచ్చింది చాన్నాళ్ళ క్రితం. సిల్క్‌ స్మిత బయోపిక్‌.. అన్న ప్రచారం జరిగింది ఆ సినిమా విషయంలో. సినిమా చుట్టూ చాలా వివాదాలు నడిచాయి. అంత 'డర్టీ'గా ఎలా ఎక్స్‌పోజింగ్‌ చేసింది.? అంటూ నటి విద్యా బాలన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, సినిమా వచ్చాక.. సినిమాలో విద్యాబాలన్‌ అందాల ప్రదర్శన ఎవరికీ కన్పించలేదు. ఆ సినిమాలోని ఆమె నటనకు అంతా ఫిదా అయిపోయారు.

 

మరి, దాదాపు అలాంటి టైటిల్‌తో వస్తోన్న 'డర్టీ హరి' పరిస్థితేంటి.? ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు, తన సహజ శైలికి భిన్నంగా రూపొందించిన సినిమా 'డర్టీ హరి'. ఇది ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హద్దులు మీరిన వల్గారిటీ ఈ సినిమాలో వుందనే ప్రచారం జరుగుతోంది. పోస్టర్లు, ప్రోమోలూ అలాగే డిజైన్‌ చేశారు. కానీ, యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే ఓ ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందట.

 

అదేంటన్నది సినిమా చూస్తేనే తెలుస్తుందట. సినిమా చూశాక, చాన్నాళ్ళు ఆ సినిమాని మర్చిపోలేం.. అని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళంతా ఇప్పటికే 'డర్టీ హరి' సినిమా చూసేశారట. ఇంతకీ, 'డర్టీ హరి' సినిమాలో ఏముంది.? ఇదైతే ప్రస్తుతానికి సస్పెన్సే. కానీ, 'అంతకు మించి ఏదో వుంది..' అన్న అభిప్రాయం మాత్రం బలంగా విన్పిస్తోంది. చాలా అరుదుగా ఇలాంటి టాక్‌, ఈ తరహా సినిమాల విడుదలకు ముందు వినిపిస్తుంటుంది. ఏమో, 'డర్టీ హరి' ఏం చేస్తాడోగానీ.. ఓటీటీ ట్రెండ్‌లో బూతు వ్యవహారం.. అనిపించకపోతే అదే పదివేలు.. అన్నది చాలామంది సగటు సినీ ప్రేక్షకుల భావన.

ALSO READ: లావణ్య త్రిపాఠి సక్సెస్‌ సీక్రెట్‌ అదేనట