ENGLISH

సునీత పెళ్లి వాయిదా?

16 December 2020-09:36 AM

గాయ‌ని సునీత‌... రెండో పెళ్లికి సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. `మ్యాంగో` రామ్ తో ఇటీవ‌ల సునీత నిశ్చితార్థ‌మైంది. డిసెంబ‌రు 27న బంధువుల స‌మ‌క్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోవాల‌ని సునీత భావించింది. అయితే.. ఇప్పుడు అనుకోని కార‌ణాల వ‌ల్ల పెళ్లి వాయిదా ప‌డింద‌ని తెలుస్తోంది. ఈ పెళ్లి జ‌న‌వ‌రికి వాయిదా ప‌డింద‌ని స‌మాచారం. జ‌న‌వ‌రి దాటితే మంచి ముహూర్తాలు లేవు. అందుకే ఎట్టిప‌రిస్థితుల్లోనూ జ‌న‌వ‌రిలోనే పెళ్లి జ‌ర‌గాల‌ని సునీత - రామ్ లు భావిస్తున్నారు.

 

త‌న పెళ్లి విష‌యాన్ని ఇటీవ‌ల‌... సోష‌ల్ మీడియా ద్వారా సునీత స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టింది. త‌న కొత్త జీవితానికి అంద‌రి ఆశీస్సులూ కావాల‌ని కోరింది. సోష‌ల్ మీడియాలో.. సునీత‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ఈ స్పంద‌న ప‌ట్ల సునీత సంతోషం వ్యక్తం చేసింది. నిశ్చితార్థ ఫొటోల్ని సోష‌ల్ మీడియాలోనూ పంచుకుంది. ఇంత‌లో అనుకోకుండా పెళ్లి వాయిదా ప‌డింది. కొత్త ముహూర్తం ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

ALSO READ: లావణ్య త్రిపాఠి సక్సెస్‌ సీక్రెట్‌ అదేనట