ENGLISH

లావణ్య త్రిపాఠి సక్సెస్‌ సీక్రెట్‌ అదేనట

15 December 2020-18:00 PM

ఒక్క సినిమా ఫ్లాపయితే చాలు, కెరీర్‌ ముగిసినట్లేనంటూ చాలా సందర్భాల్లో లావణ్య త్రిపాఠిపై అటు సినీ పరిశ్రమలోనూ, ఇటు సినీ మీడియాలోనూ చర్చ జరిగింది. కానీ, ఎప్పటికప్పుడు బౌన్స్‌ బ్యాక్‌ అవుతూ వస్తోంది ఈ అందాల రాక్షసి. ఇంతకీ, లావణ్య త్రిపాఠి సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటి.? ఇదే ప్రశ్నని ఆమె ముందుంచితే, 'కెరీర్‌లో ఎత్తు పల్లాలు సహజమే.

 

ఎప్పుడూ హ్యాపీగా వుండడమే బహుశా నా సక్సెస్‌ సీక్రెట్‌ ఏమో. నా మీద నమ్మకంతో దర్శక నిర్మాతలు ఇస్తోన్న అవకాశాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.. నన్ను అభిమానిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు నేనెప్పుడూ రుణపడి వుంటా..' అంటోంది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. సక్సెస్‌ వచ్చినప్పుడు పొంగిపోయి, అత్యుత్సాహం ప్రదర్శించినా కష్టమే.. ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు కుంగిపోయినా కష్టమేనన్నది చాలా తక్కువమందికి మాత్రమే అర్థమవుతుంటుంది.

 

అలా అర్థం చేసుకున్నోళ్ళకి ఆటోమేటిక్‌గా కెరీర్‌లో ముందడుగు తేలిగ్గా పడుతుంది. ఆ విషయంలో లావణ్య త్రిపాఠి చాలా లక్కీ. హిట్టు కొట్టినప్పుడెలా వుందో, ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడూ అలానే వుంది ఈ బ్యూటీ. ఇక, ఫిట్‌నెస్‌ పరంగా ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పే లావణ్య త్రిపాఠి, సోషల్‌ మీడియాలో అభిమానులకు చేరువవడం కూడా తన సక్సెస్‌ సీక్రెట్‌ అంటోంది. 'నాలో కొత్త ఉత్సాహాన్ని నింపేది నా అభిమానులే.. ఈ విషయంలో అభిమానులకి రుణపడి వుంటాను..' అని చెబుతోందీ అందాల రాక్షసి.

ALSO READ: Lavanya Tripathi Latest photoshoot