ENGLISH

గోపీచంద్‌ కొత్త కొత్తగా..

15 March 2017-11:53 AM

గోపీచంద్‌ మంచి యాక్షన్‌ హీరో అన్న సంగతి తెలిసిందే. సంపత్‌ నంది వంటి యాక్షన్‌ డైరెక్టర్‌తో గోపీచంద్‌ సినిమా అంటే అంచనాలు బాగానే ఉన్నాయి. సంపత్‌ నంది డైరెక్షన్‌లో గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'గౌతమ్‌ నందా'. ఈ సినిమాలో యాక్షన్‌కే పెద్ద పీట వేశారట. అంతే కాదు ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ చాలా కొత్తగా ఉండబోతున్నాయట. ఇంతవరకూ ఏ సినిమాలోనూ చూడని అద్భుతమైన పోరాట ఘట్టాలను ఈ సినిమాలో చూపించనున్నారట డైరెక్టర్‌. ఈ సినిమాలో గోపీచంద్‌ ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయనున్నారు. కేధరీన్‌ టెస్రా, హన్సిక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంపత్‌ నంది సినిమాలోని హీరోలు మాస్‌ అప్పీల్‌తో పాటు చాలా స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలో గోపీచంద్‌ ఇంతకు ముందెన్నడూ కనిపించనంత కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా కంప్లీట్‌ అయ్యింది. ఈ సినిమా పాటల కోసం సరికొత్త లొకేషన్స్‌ని ఎంచుకున్నారట. విజువల్‌గా అత్యద్భుతంగా ఉండనున్నాయంటున్నారు ఈ సినిమాలోని పాటలు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరో పక్క గోపీచంద్‌ 'ఆక్సిజన్‌' సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. సీనియర్‌ డైరెక్టర్‌ బి.గోపాల్‌ డైరెక్షన్‌లో గోపీచంద్‌ మరో యాక్షన్‌ మూవీ కూడా సెట్స్‌పై ఉంది. 

 

ALSO READ: స్పీడు పెంచిన అక్కినేని హీరో