ENGLISH

స్పీడు పెంచిన అక్కినేని హీరో

15 March 2017-11:48 AM

'నమో వేంకటేశాయ' సినిమాతో ఇటీవలే మన ముందుకు వచ్చాడు నాగార్జున. మరో పక్క 'రాజుగారి గది 2' సినిమా సెట్స్‌ మీద ఉంది. ఈ లోగానే మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు నాగార్జున. యంగ్‌ హీరో నిఖిల్‌తో నాగార్జున మల్టీ స్టారర్‌ సినిమా చేయబోతున్నాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని చందు మెండేటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ కూడా థ్రిల్లింగ్‌ అంశాలతోనే ఉండబోతోందంటున్నారు. నిఖిల్‌తో 'కార్తికేయ' సినిమాని తెరకెక్కించిన చందు మొండేటి మంచి విజయం అందుకున్నారు. అలాగే ఇటీవల 'ప్రేమమ్‌' సినిమాతోనూ ఆయన పేరు మార్మోగిపోతోంది. తాజాగా నాగార్జునతో చేయబోతున్న ఈ సినిమా చాలా స్పెషల్‌గా ఉండబోతోందట. టాలీవుడ్‌ మన్మధుడిగా పిలవబడే నాగార్జున తొలిసారిగా హారర్‌ మూవీ 'రాజుగారి గది 2'లో నటిస్తున్నారు. ఇదే కాక మరో సినిమా కూడా చర్చల దశలో ఉందట. త్వరలోనే ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది. ఈ సినిమాను తన సొంత బ్యానర్‌లో తెరకెక్కించాలనుకుంటున్నారట నాగార్జున. అంతేకాదు విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న కొడుకు అఖిల్‌ సినిమాని కూడా నాగార్జునే నిర్మిస్తున్నారు. ఇలా నాగార్జున ఓ పక్క హీరోగా, మరో పక్క నిర్మాతగా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీస్‌ని ఎంచుకుంటూ రేస్‌లో స్పీడుగా దూసుకెళ్లిపోతున్నారు. 

ALSO READ: లంకలో అందాల రాశి మేటరేంటి?