ENGLISH

ఇషాన్‌ ఫ్యూచర్‌ సూపర్‌ స్టార్‌

03 March 2017-13:07 PM

పూరీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'రోగ్‌'. ఈ సినిమా కొత్త నటీనటులతో తెరకెక్కుతోన్న చిత్రం కావడం విశేషం. ఇషాన్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే ముద్దుగుమ్మ ఏంజెలా కూడా ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ హీరోని పొగడ్తలతో ముంచెత్తేస్తోంది. ఏకంగా ఇషాన్‌ ఫ్యూచర్‌ సూపర్‌స్టార్‌ అని ప్రశంసించేస్తోంది. కొత్త వాళ్లైనా కానీ పూరీ ట్రైనింగ్‌తో ఈ హీరో హీరోయిన్లు చాలా బాగా నటించారంటున్నారు ఈ సినిమాలో. అందుకే పూరీ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యింది. చాలా మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. 'రోగ్‌' 'మరో చంటిగాడి ప్రేమకథ' అనే క్యాప్షన్‌తో వస్తోంది ఈ సినిమా. ఓ చంటిగాడి ప్రేమకథగా తెరకెక్కిన 'ఇడియట్‌' సినిమా రవితేజ కెరీర్‌ని టర్న్‌ చేసింది. అదే ఉత్సాహంతో, అదే స్ట్రాటజీతో వస్తోంది ఈ సినిమా. అందుకే ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. ఇక హీరో విషయానికి వస్తే, ఆరడుగుల అందగాడు. డాన్సులు బాగా చేశాడు. ఫైట్స్‌ కూడా అదరగొట్టేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో ఇషాన్‌ ఎనర్జీ లెవల్స్‌ చాలా బాగున్నాయంటున్నారు. అలాగే హీరోయిన్స్‌లో ఏంజెలాతో పాటు మరో ముద్దుగుమ్మ మన్నారా చోప్రా కూడా ఈ సినిమాలో నటిస్తోంది. పూరీ సినిమాలో ఉండాల్సినవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయట. ట్రైలర్‌తోనే అది ప్రూవ్‌ అయిపోయింది. తెలుగుతో పాటు కన్నడలో కూడా ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. 

ALSO READ: గ్లామరస్‌గా కనిపించడం అంటే ఇష్టం