ENGLISH

ప్రభాస్ కోసం రూటు మార్చిన దిశా

02 January 2024-15:09 PM

దిశా పటాని అంటే తెలియని వారు లేరు. లోఫర్ మూవీ తో టాలీవుడ్ లో వరుణ్ తేజ్ తో కలిసి నటించింది. ధోని అన్ టోల్డ్ స్టోరీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో దిశా పటాని క్రేజే వేరు అని ఆమె ఫాలోవర్స్ సంఖ్య చూస్తే అర్థం చేసుకోవచ్చు. యాక్టింగ్ కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే బాగా గుర్తింపు పొందింది దిశా పటాని. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తో దిశా డేటింగ్ వ్యవహారం బాలీవుడ్‌లో ఎప్పటికీ హాట్ టాపికే.


సినిమాల కంటే హాట్, హాట్ ఫోటో షూట్ లతో కుర్ర కారు మతి పోగెట్టే ఈ బ్యూటీ ప్రజంట్ ప్రభాస్ కల్కి 2898 ADలో నటిస్తోంది. నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దిశా పటాని మొదటి సారి సంప్రదాయ పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ లో , బికినీల్లో మెప్పించిన దిశా,  ప్రభాస్ కోసం ఒక డీగ్లామర్ పాత్రలో కనిపించనుంది. 


ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీలో ఇప్పటికే దిశా పాత్రకి సంబందించిన షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, సమాచారం. ఈ న్యూస్ తెలిసిన కుర్ర కారు కొంత నిరుత్సాహానికి గురి అయ్యారు. దిశా గ్లామర్ కోసం సినిమా కి వెళ్లే వారికి నిరాశే మిగలనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ  పాన్-ఇండియా  ప్రాజెక్ట్‌లో ప్రభాస్, అమితాబ్ , కమల్ హాసన్, దీపికా పదుకొనే  లాంటి మహా మహులున్నారు. దిశా డీ గ్లామర్ ప్రభాస్ కి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.