ENGLISH

జపాన్ భూకంపంపై ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

02 January 2024-09:40 AM

సెలబ్రిటీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్ళటం పరిపాటి. ఎన్టీఆర్ కూడా తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి జపాన్ వెళ్లారు. ఎన్టీఆర్ కి జపాన్ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గూర్చి ఫాన్స్ కంగారు పడుతున్నారు. ఎందుకంటే న్యూ ఇయర్ ప్రపంచమంతా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటుంటే జపాన్ ప్రజలు మాత్రం మృత్యు భయంతో ఆందోళనలో ఉన్నారు. జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.4గా నమోదైంది. సెంట్రల్ జపాన్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇంకో వైపు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అందుకని, ఎన్టీఆర్ గూర్చి ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో  అని అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యం లోనే ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
 

ఎన్టీఆర్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. జపాన్ భూకంపం గురించి ట్వీట్ చేశారు. ''జపాన్ నుంచి ఇవాళ ఇంటికి వచ్చాను. అక్కడ భూకంపం గురించి తెలిసి షాక్ అయ్యాను. గత వారం అంతా జపాన్‌లో ఉన్నాను. మేం సేదతీరిన ప్రాంతంలో భూకంపం రావడం నా హృదయాన్ని కలిచివేసింది. భూకంపం బారిన పడిన ప్రజల గురించి ఆలోచిస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. జపాన్ ప్రజలూ... ధైర్యంగా ఉండండి'' అని ట్వీట్ చేశారు. 


ఎన్టీఆర్ ట్వీట్ కి రాజమౌళి స్పందిస్తూ, "జపాన్ లో తరచుగా వచ్చే భూకంపాలు గూర్చి వింటుంటే హృదయం ద్రవిస్తోంది. జపాన్ కి నా హృదయం లో ప్రత్యేక స్థానం ఉంది. నాకే కాదు చాలామందిది కూడా ఇదే అభిప్రాయం" అని ట్వీట్ చేసారు జక్కన్న.