ENGLISH

స్లో మోషన్‌లో 'లోఫర్‌ బ్యూటీ' అదిరిపోయే రొమాన్స్‌.!

25 April 2019-18:00 PM

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం 'భారత్‌' నుండి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఈ సాంగ్‌లో సల్మాన్‌ ఖాన్‌ బైక్‌పై విన్యాసాలు చేయగా, దిశాపటానీ హాట్‌ హాట్‌ స్టెప్పులిరగదీసింది. ఐటెం సాంగ్‌ని మించిన హాట్‌నెస్‌తో దిశాపటానీ కెవ్వు కేక పుట్టించింది. కత్రినా కైఫ్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్త్నున్న ఈ సినిమాలో దిశా పటానీ, సల్మాన్‌ఖాన్‌కి సోదరిగా నటిస్తోందంటూ ప్రచారం జరిగిందింతవరకూ. 

 

కానీ ఈ స్లో మోషన్‌ సాంగ్‌ విడుదలయ్యాక అదంతా ఉత్తదే అని తేలింది. ఎందుకంటే ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ - దిశాపటానీ ఘాటు రొమాన్స్‌ అంత స్పష్టంగా కనిపించింది మరి. ఎల్లో కలర్‌ కాస్ట్యూమ్‌లో డీప్‌గా క్లీవేజ్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ దిశాపటానీ వేస్తున్న చిందులు కుర్రకారును ఊపేస్తున్నాయి. అసలే సోషల్‌ హాట్‌ బ్యూటీగా దిశాపటానీకి బోలెడంత ఫాలోయింగ్‌ ఉంది. 

 

 

ఈ లేటెస్ట్‌ సాంగ్‌లో దిశాపటానీ హాట్‌ అప్పీల్‌తో పాటు, ఏక్రోబాటిక్‌ విన్యాసాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో 'లోఫర్‌' సినిమాలో నటించిన దిశాపటానీ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సరసన వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ఈద్‌కి విడుదల కాబోయే 'భారత్‌'తో పాటు, బాలీవుడ్‌ గ్రీకు వీరుడు హృతిక్‌ రోషన్‌తో ఇంకో సినిమాలోనూ దిశాపటానీ నటిస్తోంది. 

ALSO READ: లారెన్స్ దూకుడు మామూలుగా లేదు