ENGLISH

వల చాటు 'ఈ(ని)షా' చూడతరమా.!

19 July 2018-18:18 PM

'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో తెరంగేట్రం చేసిన అచ్చ తెలుగు ముద్దుగుమ్మ ఈషా రెబ్బ. ఈ మధ్య 'ఆ' సినిమాతో పాపులర్‌ అయ్యింది. 'అమీ తుమీ' చిత్రంలోనూ నటించింది. ఈషాలో సమ్‌థింగ్‌ విషయం ఉంది. నేచురల్‌ బ్యూటీతో ఇట్టే ఆకట్టేసుకుంటుంది అందుకే. సినిమాలతో పాటు, సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా పోస్ట్‌ చేసిన పిక్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బ్లాక్‌ నెట్టెడ్‌ స్లీవ్‌లెస్‌ టాప్‌లో, మస్టర్డ్‌ బోటమ్‌తో అలా నడుచుకుంటూ వస్తున్న ఈషా అందాలను వర్ణించ తరమా అనేలా ఉంది ఆ పిక్‌. కనీ కనిపించని అందాలతో కవ్వించడమంటే ఇదే మరి. ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళంలోనూ అవకాశాలు దక్కించుకుంటోంది ఈషారెబ్బ. వచ్చిన ప్రతీ అవకాశాన్నీ అందిపుచ్చుకోవడం కన్నా, సెలెక్టివ్‌గా సినిమాలు చేసి, మంచి నటి అనిపించుకోవడమే తన లక్ష్యమంటోంది అందాల భామ ఈషా రెబ్బ.

ALSO READ: Qlik Here For The Gallery Of Eesha