ENGLISH

ఎఫ్ 3... రావిపూడికి ఎంతిచ్చింది?

09 June 2022-11:12 AM

వ‌రుస హిట్ల‌తో.. అప‌జ‌యం లేని ద‌ర్శ‌కుడిగా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ఇటీవ‌ల ఎఫ్ 3 కూడా ఆర్థికంగా మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమా వంద కోట్ల క్ల‌బ్ లో చేరింద‌ని నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించారు కూడా. ఈ సినిమా కి అనిల్ రావిపూడి పైసా కూడా పారితోషికం తీసుకోలేద‌ని టాక్‌. కానీ లాభాల్లో వాటా.. అడిగాడ‌ట‌. అనిల్ రావిపూడికి వ‌రుస‌గా అన్నీ విజ‌యాలే. త‌న పారితోషికం రూ.10 కోట్ల వ‌ర‌కూ ప‌లుకుతుంది. మ‌రో రెండు కోట్లు అడిగినా.. దిల్ రాజు ఇవ్వ‌డానికి రెడీ. కానీ రూ.12 కోట్ల‌ని కాద‌నుకొన్నాడు అనిల్ రావిపూడి.

 

చివ‌రికి ఈ సినిమా లాభాల ద్వారా.. త‌న వాటా రూ.20 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. రూ.40 కోట్ల‌లో ఈ సినిమా పూర్త‌యింది. ప‌బ్లిసిటీ అంతా క‌లుపుకుంటే మ‌రో రూ.5 కోట్లు. అంటే.. 45 కోట్లు. ఖ‌ర్చుల‌న్నీ పోను.. ఈ సినిమాకి రూ.85 కోట్లు వ‌చ్చాయ‌నుకొంటే, 40 కోట్లు లాభం. అందులో స‌గం.. రావిపూడి ప‌ట్టుకెళ్లిపోయాడు. ఓ ద‌ర్శ‌కుడికి రూ.20 కోట్ల పారితోషికం అంటే మాట‌లు కాదు. పారితోషికం అందుకుంటే రూ.12 కోట్ల‌ద‌గ్గ‌రే ఆగిపోయేవాడు. లాభాల్లో వాటాకి వెళ్లాడు కాబ‌ట్టే మ‌రో 8 కోట్లు వ‌చ్చాయి. ఈ విష‌యంలో అనిల్ రావిపూడి స్ట్రాట‌జీ వ‌ర్క‌వుట్ అయ్యింది.

ALSO READ: నక్సల్ సినిమా ఎవరు చూస్తారు ? దర్శకుడి సమాధానం