ENGLISH

ట్రైలర్ : 'గాడ్సే' పొలిటికల్ వార్

09 June 2022-13:13 PM

‘‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’’అంటున్నాడు సత్యదేవ్. సత్యదేవ్‌ - గోపీ గణేశ్ పట్టాభి కలయికలో వస్తున్న పొలిటికల్‌ థ్రిల్లర్ గాడ్సే. ఈ సినిమా ట్రైలర్ ని వరుణ్‌తేజ్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్ అంతా పొలిటికల్ డైలాగులతో నిండిపోయింది.

 

‘‘అర్హతున్నోడే అసెంబ్లీలో ఉండాలి.. పద్ధతున్నోడే పార్లమెంట్‌లో ఉండాలి.. మర్యాదున్నోడే మేయర్‌ కావాలి.. సభ్యతున్నోడే సర్పంచి కావాలి’’ . ‘‘సత్యమేవ జయతే అంటారు.. ధర్మో రక్షతి రక్షితః అంటారు.. కానీ, సమాజంలో సత్యం, ధర్మం ఎప్పుడూ స్వయంగా గెలవడం లేదు’ ‘‘పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చిందెంత? అప్పుల రూపంలో ప్రపంచబ్యాంకు నుంచి తెచ్చిందెంత?’’ ఇలా అన్నీ పొలిటికల్ డైలాగులే. బ్రస్టుపట్టిన రాజకీయ వ్యవస్థపై గాడ్సే పోరాటంగా ఈ కథ ఉండబోతుంతుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ALSO READ: ఎఫ్ 3... రావిపూడికి ఎంతిచ్చింది?