ENGLISH

'సైరా' సెట్‌లో అగ్ని ప్రమాదం, భారీ నష్టం!

03 May 2019-10:30 AM

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిన్న రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగిందనీ తెలుస్తోంది. దాదాపు 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందనీ సమాచారమ్‌. బీదర్‌ సెట్‌ అట ఇది. బీదర్‌లోనే ఈ షూటింగ్‌ చేద్దామనుకున్నారట. అయితే, స్థానికంగా షూటింగ్‌ నిమిత్తం కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో కోట్లు ఖర్చుపెట్టి భారీ సెట్‌ని నిర్మించారు.

 

హైద్రాబార్‌ శివార్లలో వేసిన ఈ సెట్‌ ఇలా అగ్నిప్రమాదానికి గురి కావడంతో 'సైరా' యూనిట్‌ షాక్‌లో ఉంది. ఇంకా 20 రోజులు పైగా ఈ సెట్‌లో షూటింగ్‌ నిర్వహించాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాదంలో సెట్‌ పూర్తిగా ధ్వంసమైపోయిందట.అయితే, ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఏది ఏమైనా ఈ ప్రమాదం సైరాకి తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. చిరంజీవి 151వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, తమిళ హీరో విజయ్‌సేతుపతి, కన్నడ హీరో సుదీప్‌, జగపతిబాబు, తమన్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నారు. ఆగష్టులో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ALSO READ: MUNNA BHAI'S HELPING HAND FOR SYERAA