ENGLISH

పూర్తిగా 'వాల్మీకి'లా మారిన మెగా ప్రిన్స్‌!

02 May 2019-19:00 PM

మెగా హీరోలకు ఈ మధ్య గుబురు గెడ్డం తెగ కలిసొచ్చేస్తోంది. రామ్‌చరణ్‌ 'రంగస్థలం'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టేశాడు. వరుసగా ఆరు ఫ్లాపుల తర్వాత దాదాపు అంతా మర్చిపోయారనుకున్న తరుణంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ 'చిత్రలహరి'తో హిట్‌ కొట్టేశాడు. ఈ సినిమాలో తేజు గుబురు గెడ్డంతోనే కనిపించాడు.

 

ఇక ఇప్పుడు మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ టైమొచ్చింది. ఈయన ఆల్రెడీ 'తొలిప్రేమ' సినిమాలో గెడ్డం లుక్‌ పరిచయం చేసేశాడు. కానీ, అది స్టైలిష్‌ లుక్‌. కానీ ఇప్పుడు గుబురు గెడ్డంతో వస్తున్నాడు వరుణ్‌తేజ్‌. అదీ 'వాల్మీకి' సినిమా కోసం. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ 'జిగర్తాండ' మూవీకి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

 

అయితే ఈ సినిమా కథా కమామిషు సంగతేంటనేది పక్కన పెడితే, ఈ సినిమాలో వరుణ్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నాడనీ ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ లుక్‌ ఇదీ అంటూ ఆన్‌ లొకేషన్‌ ఫోటోలు కొన్ని నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఒత్తైన జుట్టు, గుబురు గెడ్డంతో కనిపిస్తున్నాడు ఈ లుక్‌లో వరుణ్‌. ఇది మాత్రమే కాదు, ఈ సినిమాలో వరుణ్‌ మరో డిఫరెంట్‌ లుక్‌లో కూడా కనిపిస్తాడంటూ మరో గాసిప్‌ తాజాగా బయటికొచ్చింది. మొత్తానికి 'వాల్మీకి' లుక్స్‌పై హల్‌చల్‌ చేస్తున్న ఈ గాసిప్స్‌ నిజమో కాదో తెలియాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా రెస్పాండ్‌ కావాలి. ఏమైతేనేం, 'గెడ్డం' సక్సెస్‌ని వరుణ్‌తేజ్‌ కూడా కంటిన్యూ చేస్తాడేమో చూడాలిక.

ALSO READ: నాన్న, నేను ఓన్లీ ఫన్‌, నో ఫ్రస్ట్రేషన్‌: బన్నీ