గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10 న రిలీజ్ కానుంది. ఈ మూవీ లోచెర్రీకి జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. మొదటి నుంచి శంకర్ దర్శకత్వం పై నమ్మకం లేని మెగా ఫాన్స్, టీజర్ రిలీజ్ తో ఊపిరి పీల్చుకున్నారు. గేమ్ చేంజర్ నుంచి వస్తున్న పాటలు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబరు లోనే ట్రైలర్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు గేమ్ చేంజెర్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఫాన్స్ ని మరింత ఎంగేజ్ చేస్తోంది. మెగా ఫాన్స్ కి పూనకాలు తెచ్చేలా ఉంది ఈ న్యూస్. అదేంటి అంటే 'గేమ్‌ఛేంజర్-2' కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలన్నీ 2 పార్ట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ కి కూడా సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. 2025 జనవరి 10న పార్ట్ వన్ రిలీజ్ చేసి, తరవాత వన్ ఇయర్ గ్యాప్ లో పార్ట్ 2 రిలీజ్ చేయనున్నట్లు టాక్. శంకర్ కూడా సీక్వెన్స్ లపై ద్రుష్టి పెట్టారు. ఈ క్రమంలోనే అప్పుడెపుడో తీసిన భారతీయుడు సినిమాకి ఈ మధ్య సీక్వెల్ గా భారతీయుడు 2, భారతీయుడు 3 తీశారు.
ఇప్పడు రామ్ చరణ్ నటించిన గేమ్ చెంజర్ కి కూడా పార్ట్ 2 తీసే పనిలో ఉన్నారట శంకర్. గేమ్ చేంజర్ తరవాత భారతీయుడు 3 రిలీజ్ చేసి, నెక్స్ట్ గేమ్ చేంజర్ పార్ట్ 2 పై ద్రుష్టి పెడతారంట. కానీ చరణ్ ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఒక వైపు RC16 చేస్తూనే మరోవైపు సుకుమార్ తో ఒక ప్రాజెక్ట్, ఇంకో రెండు మూడు సినిమాల కథలు విని పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. దీనితో శంకర్ కి చరణ్ డేట్స్ ఇవ్వగలడా, అని సందేహాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే చరణ్ గేమ్ చేంజర్ కోసం మూడేళ్లు లాక్ అయిపోయాడు. మళ్ళీ శంకర్ ని చెర్రీ నమ్మాలంటే, మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవాలి.
ALSO READ: మళ్ళీ రెండోసారి సిల్క్ స్మిత బయోపిక్