ENGLISH

మళ్ళీ రెండోసారి సిల్క్ స్మిత బయోపిక్

02 December 2024-17:22 PM

సిల్క్ స్మిత పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది. నైంటీస్ లో హీరోయిన్స్ కి మించి క్రేజ్ తెచ్చుకున్న గ్లామర్ నర్తకి సిల్క్ స్మిత. తాజాగా సిల్క్‌స్మిత జయంతి సందర్భంగా  ఆమె బయోపిక్‌ను అనౌన్స్ చేసారు. 'ది అన్‌టోల్డ్‌ స్టోరీ' పేరుతో తెరకెకుతున్న ఈ మూవీలో  సిల్క్‌స్మిత క్యారక్టరులో చంద్రిక రవి నటిస్తోంది. ఈ చిత్రాన్ని జయరాం అనే కొత్త దర్శకుడు పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ బయోపిక్ లో సిల్క్ స్మిత  వ్యక్తిత్వం, ఆమె వ్యక్తిగత జీవితం లాంటి చాలా విషయాలు చూపించనున్నారని జయరాం తెలిపారు.

'సిల్క్‌ స్మిత - ది క్వీన్‌ ఆఫ్ సౌత్‌' పేరుతో ఈ మూవీ గ్లింప్స్‌ శనివారం రిలీజ్ చేసారు. అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో సిల్క్‌స్మిత ట్రేడ్‌ మార్క్‌ స్టైల్ లో చంద్రిక రవి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. అసలు సిల్క్ దిగి వచ్చిందా అన్నట్టు ఉంది చంద్రిక రవి మేకోవర్. ఈమె ఇప్పటికే తమిళంలో మార్క్ ఆంటోని మూవీలో సిల్క్ స్మిత్ గా నటించి మెప్పించింది. మళ్ళీ రెండో సారి కూడా సిల్క్ పాత్ర చంద్రిక రవికి దక్కటం విశేషం. ఇప్పటికే హిందీలో విద్యాబాలన్ సిల్క్ బయోపిక్ లో నటించింది.

బాలీవుడ్ లో సిల్క్ స్మిత బయోపిక్ గా తెరకెక్కిన 'డర్టీ పిక్చర్' మూవీ బిగ్గెస్ట్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ సిల్క్ బయోపిక్ పాన్ ఇండియా రేంజ్ లో రెండో సారి తెరకెక్కుతుంది అంటే ఆమె క్రేజ్ ఏంటో తెలుస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ త్వరలో ప్రారంభమవుతుందని, మూవీ యూనిట్ తెలిపారు. STRI సినిమాస్‌ పతాకంపై ఎస్‌. బి.విజయ్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ALSO READ: OG హైపు పెంచిన ప్రభాస్