ENGLISH

OG హైపు పెంచిన ప్రభాస్

02 December 2024-16:38 PM

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ. OG మూవీని సాహో ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు. పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ టైం దొరికినప్పుడు ఈ షూటింగ్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. తాజగా హరి హర వీరమల్లు లాస్ట్ షెడ్యూల్ అని టీమ్ పోస్ట్ చేసి పవన్ ఫాన్స్ కి మంచి కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చింది. OG  షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుతెలుస్తోంది.

తాజాగా 'OG' కి సంబందించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. అది ఆషా మాషీ న్యూస్ కాదు. క్రేజీ అప్డేట్. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ  మూవీలో పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఓజి సెకండ్ హాఫ్ లాస్ట్ లో డార్లింగ్ కనిపిస్తాడని టాక్. సుజిత్ తో కలిసి ప్రభాస్ సాహోకి వర్క్ చేసాడు. మరొకసారి సుజిత్ ప్రభాస్ ని సంప్రదించగా డార్లింగ్ కూడా పాజిటీవ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ OG లో క్యామియో రోల్ చేస్తున్నట్టు తెలియటంతో OG క్రేజ్ మరింత పెరిగింది.

మేకర్స్ నుంచి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రానప్పటికీ, పవన్ సినిమాలో ప్రభాస్ నటిస్తు న్నాడనగానే OG మూవీ పై హైపు పెరిగింది. పాన్ ఇండియా సినిమా కాస్త పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళింది. OG మూవీ గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. సాహో కూడా అదే బ్యాక్ గ్రౌండ్ అవటంతో సుజిత్ మూవీ యూనివర్స్ కి కనెక్ట్ చేసేలా ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని సమాచారం.

ALSO READ: చిరుకి భారత రత్న...బాలయ్య కి పద్మ విభూషణ్