ENGLISH

ర‌ఘుప‌తి - రాఘ‌వ - రాజారామ్ క‌లిశారు

25 January 2021-09:31 AM

గ్యాంగ్ లీడ‌ర్ సినిమాని మెగా అభిమానులు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, మేన‌రిజం, పాట‌లు, స్టెప్పులు, విల‌నీ.. ఒక‌టా, రెండా.. అన్ని రంగాల్లోనూ అదుర్స్ అనిపించిన సినిమా ఇది. ఇందులో ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారామ్ లుగా.. ముర‌ళీ మోహ‌న్‌, శ‌ర‌త్ కుమార్‌, చిరంజీవి న‌టించారు. మ‌ళ్లీ... 30 ఏళ్ల త‌ర‌వాత‌.. ఈ వెండి తెర అన్న‌ద‌మ్ములు క‌లిశారు. అందుకు రామోజీ ఫిల్మ్‌సిటీ వేదిక అయ్యింది. ఆదివారం.. చిరంజీవి `ఆచార్య‌` షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. అక్క‌డే.. శ‌ర‌త్ కుమార్‌, ముర‌ళీ మోహ‌న్ లు న‌టిస్తున్న వేర్వేరు సినిమాల షూటింగులూ.. జ‌రుగుతున్నాయి.

 

చిరంజీవి ఆచార్య సెట్లో ఉన్నార‌న్న సంగ‌తి తెలుసుకున్న ముర‌ళీ మోహ‌న్‌, శ‌ర‌త్ కుమార్‌లు... ఆచార్య సెట్ కి వెళ్లి.. చిరంజీవిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ ముగ్గురూ ఓ ఫొటో తీసుకుని.. సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. ఆనాటి గ్యాంగ్ లీడ‌ర్ జ్ఞాప‌కాల్ని నెమ‌రేసుకున్నారు. ``మేం ముగ్గురం క‌లిసి.. ఆ జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోయాం. ఈ మూమెంట్ ని ఎప్ప‌టికీ మర్చిపోలేను`` అంటూ ముర‌ళీ మోహ‌న్‌.. త‌న సంతోషాన్ని ఓ వీడియో రూపంలో పంచుకున్నారు.

ALSO READ: ప్రబాస్‌ 'సలార్‌'లో టాలీవుడ్‌ యంగ్‌ హీరో?