ENGLISH

జార్జిరెడ్డికి జీవం పోసిన జీవన్‌ రెడ్డి.!

21 November 2019-17:17 PM

పేద విద్యార్ధులకు అన్యాయం జరిగితే సహించని విద్యార్ధి నాయకుడు జార్జిరెడ్డి 40 ఏళ్ల క్రితం ప్రత్యర్ధుల చేతిలో దారుణంగా మరణించారు. ఆయన 25 ఏళ్ల వయసుకే తనువు చాలించి చరిత్రలో నిలిచిపోయిన ఆయన జీవితగాధని ఇన్నాళ్ల తర్వాత సినిమాగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్‌ జీవన్‌ రెడ్డి. పలు వివాదాల నడుమ ఈ సినిమా రేపు అనగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శ్మశాన వాటికలో జార్జిరెడ్డి సమాధి వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా డైరెక్టర్‌ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ, జార్జిరెడ్డి మళ్లీ పుడుతున్నాడు అని సంబోధించారు. నిజమే, ఎప్పుడో చనిపోయి, కొంతమంది మదిలో మంచి వ్యక్తిగా, మరికొందరికి శత్రువుగా మాత్రమే తెలిసిన ఆయనను హీరోగా జీవన్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న 'జార్జ్‌రెడ్డి' చిత్రం అందరిలోనూ ఆసక్తిని నింపింది. డియర్‌ కామ్రేడ్‌గా విద్యార్ధుల్లో విప్లవ భావాలు రేకెత్తించిన జార్జిరెడ్డి జీవితం చాలా మందికి ఆదర్శం.

 

ఆదర్శవంతమైన ఆయనను ప్రత్యర్ధులు ఎందుకు చంపాల్సి వచ్చింది.? ఆయన హత్య వెనక అసలు కారణాలేంటీ.? అసలింతకీ 'జార్జిరెడ్డి' సినిమాలో ఏం చూపించారు.? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఆ ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెర పడనుంది. సందీప్‌ మాధవ్‌ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.

ALSO READ: ఫ్రీ ఆఫర్‌తో ఆ చిన్న సినిమా గట్టెక్కేనా?