ENGLISH

గాసిప్స్‌తో పండగ చేసుకుంటున్న స్టార్‌ హీరోయిన్‌

19 July 2018-11:11 AM

అప్పుడు స్టార్‌ హీరోయిన్‌. ఏ హీరో అయినా ఆమెనే తన పక్కన హీరోయిన్‌గా కావాలనుకునేవారు. అమ్మడు కూడా యంగ్‌ హీరో, స్టార్‌ హీరో అనే తేడా లేకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్నీ యూజ్‌ చేసేసుకుంది. మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా సత్తా చాటింది. అయితే ఎవరి లక్కు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కదా. ఓ చిన్న టర్నింగ్‌ ఆమెను టాలీవుడ్‌కి దూరం చేసేసింది. 

ఇంతకీ ఈమె ఎవరో తెలిసిపోయే ఉంటుందిప్పటికే. అవును మీ గెస్‌ కరెక్టే. ఆ ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగే. అప్పుడు హీరోయిన్‌గా బిజీగా గడిపిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇప్పుడు గాసిప్స్‌తోనూ, గుసగుసలతోనూ కాలక్షేపం చేస్తోంది. అయితే ఇది టాలీవుడ్‌కే పరిమితంలెండి. కోలీవుడ్‌, బాలీవుడ్‌లో రకుల్‌ హవా నడుస్తోంది. అయితే తెలుగులో మాత్రం రోజుకో గాసిప్‌తో సందడి చేస్తోంది. 

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ రామ్‌చరణ్‌ సినిమాలో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌ అనీ, 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ చేస్తోందనీ ప్రచారం జరుగుతోంది. తాజాగా మోక్షజ్ఞకు జోడీగా రకుల్‌ నటిస్తోందట 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో అంటూ కొత్తగా ప్రచారం జరుగుతోంది. ఇంతే కాక మహేష్‌ సినిమాలో రకుల్‌ హీరోయిన్‌గా ఎంపికైందంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌ జోరందుకున్నాయి. 'స్పైడర్‌'తో నిరాశపరిచిన ఈ జంట ఈ సారి హిట్‌ ఇవ్వనుందనీ, సుకుమార్‌ దర్శకత్వంలో రాబోతున్న మహేష్‌ సినిమా కోసం రకుల్‌ని ఎంచుకున్నారనీ తెలుస్తోంది. 

ఏదేమైనా రకుల్‌ టాలీవుడ్‌ రీ ఎంట్రీ గ్రాండ్‌గా స్టార్‌ హీరో సరసన హీరోయిన్‌ ప్లేస్‌తో ఉంటుందా? లేక స్పెషల్‌ సాంగ్‌, స్పెషల్‌ రోల్స్‌తో ఉంటుందా ? అనేది చూడాలి మరి.
 

ALSO READ: బాబు-గణేష్ ల 'ఒరేయ్ ఉప్మా'