ENGLISH

రంగురంగుల గుండ‌మ్మ క‌థ‌

22 December 2020-17:07 PM

గుండ‌మ్మ క‌థ‌... తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో ఓ క్లాసిక్‌. ఎన్టీఆర్ - ఏఎఎన్నార్‌ల అద్భుత‌మైన క‌ల‌యిక‌లో రూపొందిన ఆల్ టైమ్ సూప‌ర్ హిట్ సినిమా. క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్‌. సూరేకాంతం న‌ట‌న‌, పాట‌లూ గుండ‌మ్మ క‌థ‌ని మేటి చిత్రాల జాబితాలో చేర్చాయి. ఇప్పుడు ఈ చిత్రం క‌ల‌ర్ లో రాబోతోంది. లాక్‌డౌన్‌కి ముందే.. ఈ సినిమాని క‌ల‌ర్ రూపంలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం మొద‌లెట్టారు. ఇప్పుడు ఆ ప‌నుల‌న్నీ పూర్త‌య్యి ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

 

విజ‌యావారి సినిమాలు వ‌రుస‌గా క‌ల‌ర్‌లోకి మాచ్చే ప్ర‌య‌త్నాలు జ‌ర‌గుతున్నాయి. `మాయాబ‌జార్‌` ఇలా క‌ల‌ర్ లో కూడా విడుద‌లై... అద్భుతమైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ జాబితాలో `గుండ‌మ్మ క‌థ‌` చేర‌నుంది.కొన్ని థియేట‌ర్ల‌లో ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. పాత సినిమాల్ని, ముఖ్యంగా క్లాసిక్ సినిమాల్ని చూడాల‌నుకునేవాళ్ల‌కు ఇంత‌కు మించిన ఛాన్స్ ఏముంటుంది?

ALSO READ: కరోనా కొత్త స్ట్రెయిన్‌: మళ్ళీ సినీ పరిశ్రమలో గందరగోళం