ENGLISH

హెబ్బాకు ఓ ఛాన్స్‌

08 March 2021-16:00 PM

కుమారి 21 ఎఫ్ సినిమాతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిపోయింది హెబ్బా ప‌టేల్. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి అస్స‌లు మొహ‌మాట ప‌డ‌క‌పోవ‌డంతో... వ‌రుస‌గా ఛాన్సులొచ్చాయి. అయితే వాటిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయింది హెబ్బా. కొత్త క‌థానాయిక‌లు వ‌రుస క‌ట్ట‌డం, హెబ్బాకి ఫ్లాపుల మీద ఫ్లాపులు త‌గ‌ల‌డంతో.. ఎంత త్వ‌ర‌గా ఎదిగిందో, అంత త్వ‌ర‌గానే సైడ్ అయిపోయింది. ఈమ‌ధ్య `రెడ్‌`లో ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. అయినా స‌రే, ఎవ‌రి చూపూ ఆమె వైపు ప‌డ‌లేదు.

 

అయితే ఎట్ట‌కేల‌కు ఓ ఛాన్స్ వ‌చ్చింది. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా ప‌ట్టాలెక్కించేసింది. దీనికి `తెలిసిన‌వాళ్లు` అనే పేరు ఫిక్స్ చేశారు. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ కాస్త కొత్త‌గానే అనిపిస్తోంది. హార‌ర్‌, ఎమోష‌న్ డ్రామా.. ఇవ‌న్నీ మిళిత‌మైన క‌థ‌లా అనిపిస్తోంది. హెబ్బాకు ఇదే తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ విరివిగా ఉన్న ఈ నేప‌థ్యంలో.. ఇలాంటి క‌థ‌ల‌కు మంచి మార్కెట్టే ఉంది. మ‌రి... ఈసారైనా హెబ్బా.. త‌న ల‌క్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాలి.

ALSO READ: ఇంకో నాలుగు పెంచిన నాని