ENGLISH

గేర్‌ మార్చిన త్రిష

05 October 2018-12:01 PM

హీరోయిన్ త్రిష న్యూస్:-
అందాల భామ త్రిష ఇమేజ్‌ నెమ్మదిగా మళ్లీ పెరుగుతోంది. తమిళంలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి త్రిష చేతిలో. అందులో చాలావరకూ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలే కావడం విశేషం. ఇవి కాక టాలీవుడ్‌ నుండి త్రిషకు అవకాశాలు పోటెత్తుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి తదుపరి సినిమా కోసం పలువురు సినీయర్‌ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆ లిస్టులో త్రిష పేరు కూడా ఉందని సమాచారమ్‌. 

 

మరో అగ్రహీరో వెంకటేష్‌ నటిస్తున్న ఓ సినిమా కోసం కూడా త్రిష పేరును పరిశీలిస్తున్నారట. ఒకప్పుడు తెలుగులో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా వెలుగొందింది త్రిష. చిరంజీవితో సహా దాదాపు టాలీవుడ్‌ అగ్ర హీరోలందరి సరసన నటించింది, అలాగే యంగ్‌ హీరోలతోనూ నటించేసింది. కొన్ని కారణాలతో టాలీవుడ్‌లో త్రిష హవా తగ్గింది. మళ్లీ ఇప్పుడు బౌన్స్‌ బ్యాక్‌ అయ్యేలా ఉంది. రీసెంట్‌గా తమిళంలో త్రిష '96' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

 

విజయ్‌సేతుపతికి జోడీగా నటించింది ఈ సినిమాలో త్రిష. మరి కొద్ది నెలల్లో తమిళంలో త్రిష ప్రధాన పాత్ర పోషించిన సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ లోగా టాలీవుడ్‌లో కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో త్రిష ఉందని తెలుస్తోంది. టాలీవుడ్‌లో అగ్రహీరోలు యాక్టివ్‌గా ఉన్న ఈ తరుణంలో త్రిష వంటి సీనియర్‌ హీరోయిన్స్‌కి మళ్లీ పండగే అని చెప్పడం అతిశయోక్తి కాదనిపిస్తోంది. 

ALSO READ: విజయ్‌ దేవరకొండకు అగ్నిపరీక్ష.!