ENGLISH

హ్యాట్రిక్ ఫ్లాపుల త‌ర‌వాత‌... కోలుకుంటాడా?

09 March 2021-10:24 AM

చిత్ర‌సీమ‌లో.... విజ‌యానికే అగ్ర తాంబూలం. ఫ్లాపులు త‌గిలితే.. కోలుకోవ‌డం క‌ష్టం. అందునా వ‌రుస‌గా మూడు ఫ్లాపులంటే మాట‌లు కాదు. శ‌ర్వానంద్ కి ఈమ‌ధ్య హ్యాట్రిక్ ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి. గ‌త సినిమాలు ప‌డి ప‌డి లేచె మ‌న‌సు, ర‌ణ‌రంగం, జానూ... ఫ్లాపులే. ఇప్పుడు త‌న నుంచి మ‌రో సినిమా వ‌స్తోంది. అదే..`శ్రీ‌కారం`. శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌ల అవుతోంది. రైతు స‌మ‌స్య‌లపై మాట్లాడుతున్న క‌థ ఇది. ఈమ‌ధ్య రైతు క‌థ‌లు బాగానే వ‌ర్క‌వుట్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో శ్రీ‌కారం కూడా మంచి రిజ‌ల్ట్ తెచ్చుకునే అవ‌కాశం పుష్క‌లంగా ఉంది.

 

మూడు ఫ్లాపులొచ్చినా శ‌ర్వా ఇమేజ్ ఏం త‌గ్గ‌లేదు. త‌న శ్రీ‌కారం సినిమా బిజినెస్ చూస్తే ఈ విష‌యం అర్థం అవుతుంది. ఈ సినిమాకి 17 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. నైజాంలో 5.7 కోట్ల‌కు ఈ సినిమా కొన్నారు. తొలి మూడు రోజుల్లో క‌నీసం 10 నుంచి 12 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. మౌత్ టాక్ బాగుంటే.. ఈ అంకె పెర‌గొచ్చు. అయితే 17 కోట్ల మార్క్‌ని చేరుకోవ‌డానికి శ్రీ‌కారం సినిమాకి ఎన్ని రోజులు ప‌డుతుంద‌న్న‌ది.. ఈ సినిమా టాక్ ని బ‌ట్ట డిసైడ్ అవుతుంది.

ALSO READ: వైష్ణ‌వ్ తేజ్ చేతిలో ఆరు సినిమాలా?