ENGLISH

ఇలియానా ఇంత ముదిరిపోయిందేంటీ?

26 August 2017-19:21 PM

'బాద్‌షాహో' సినిమాలో ఇలియానా టాప్‌లెస్‌గా కనిపించిన ఫొటో వైరల్‌గా మారింది. అయితే అదంతా ఫేక్‌ అనే ప్రచారం నేపథ్యంలో ఇల్లీబేబ్‌ కొంచెం ఆందోళన చెందినట్టుంది. కష్టపడి టాప్‌లెస్‌గా నటిస్తే, అది గ్రాఫిక్స్‌ అనో కెమెరా మాయాజాలమనో జనం అనుకోవడంపై అసహనంతో ఊగిపోయిన బెల్లీ బ్యూటీ ఇలియానా ఆ సీన్‌ గురించి వివరిస్తూ మీడియాకెక్కింది. నటీనటుల మధ్య అండర్‌స్టాండ్‌ ఉంటే తప్ప అలాంటి సీన్స్‌ చేయడం కుదరదనీ చెబుతూ, అజయ్‌దేవగన్‌ జెంటిల్‌మెన్‌ కాబట్టే ఆ సీన్‌ అంత బాగా వచ్చిందని పూర్తిగా టాప్‌లెస్‌గానే ఆ సీన్‌ చేయడం జరిగిందని వివరించింది. వినడానికి ఇలియానా మాటలు బాగానే ఉన్నా, అవి నమ్మదగ్గవిగా లేవు. ఇలియానా కొత్తగా ఇలాంటి సీన్స్‌ చేయలేదు. ఎందరో బాలీవుడ్‌ తారలు ఇలాంటి సీన్స్‌లో కనిపించారు. ఐశ్వర్యారాయ్‌ కూడా చేసిందిగానీ వాటన్నిటినీ కెమెరా ట్రిక్‌ ద్వారానే చేశారు. పాతకాలంలో కూడా ఈ ట్రిక్స్‌ వాడేశారు. టెక్నాలజీ లేని సమయంలోనే సెమీ న్యూడ్‌ సీన్స్‌ వెండితెరపై కనిపించాయి కాబట్టి ఇప్పుడు ఇంకా తేలిగ్గా ఆ టెక్నాలజీని వాడుకుంటారు. అది తెలిసీ ఇలియానా టాప్‌లెస్‌ సీన్‌ గురించి 'కష్టపడటం' అంటే ఇది పూర్తిగా పబ్లిసిటీ కోసమే అయి ఉండొచ్చని అనుకోవడం తప్పు కాదేమో. ఏదేమైనా ఇలియానా బాగా ముదిరిపోయింది. ఎంత ముందిరిపోయిందంటే టాప్‌లెస్‌గా నటించానోచ్‌ అని డప్పేసుకునేంతలాగా.

ALSO READ: అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్స్