ENGLISH

సమంతని వెనక్కి నెట్టిన శోభిత

06 December 2024-10:49 AM

ప్రతీ నెల ఐఎండీబీ మోస్ట్‌ పాపులర్ స్టార్స్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ గా ఈ సర్వే జరుగుతుంది. సోషల్‌ మీడియాలో, ఇంటర్నెట్‌ లో ఎవరి గూర్చి ఎక్కువ సెర్చ్ చేసారో అన్న అంశంపై ఈ జాబితా ఉంటుంది. 2024 కి ముగింపు పలకనున్న సందర్భంగా, ఈ ఏడాది ఐఎండీబీ ఇండియన్ మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్స్ టాప్‌ 10 లిస్ట్ రిలీజ్ చేసారు. ఇందులో సౌత్ వారికి చోటు దక్కటం గమనార్హం. ఎప్పుడు బాలీవుడ్ హీరోలు హీరోయిన్స్ మాత్రమే ఐఎండిబి లిస్ట్ లో ఉంటారు. కానీ ఇప్పడు తెలుగు హీరోలు , హీరోయిన్స్ కూడా వరల్డ్ వైడ్ గుర్తింపుతెచ్చుకుంటున్న కారణంగా వారు టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు.

యానిమల్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రీ టాప్ వన్ లో నిలిచింది. యానిమల్ సినిమాలో త్రిప్తి ఒలికించిన గ్లామర్ దెబ్బకి ఆమెకోసం సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేసారు. సెకండ్ ప్లేస్ లో దీపికా పదుకొణె నిలిచింది. కల్కి మూవీ వలన దీపికా సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. థర్డ్ ప్లేస్ లో షాహిద్ కపూర్ తమ్ముడు  ఇషాన్ ఖట్టర్, ఫోర్త్ ప్లేస్ లో  షారుఖ్ ఖాన్‌ ఉన్నారు. ఫిఫ్త్  ప్లేస్ లో అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ నిలిచింది. హిందీలో పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం, నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో శోభిత కోసం ఎక్కువమంది సెర్చ్ చేసారు. ఈ క్రమంలో టాప్5 లో ప్లేస్ పొందింది శోభిత.

సిక్స్త్ ప్లేస్ లో శార్వరీ వాఘా, సెవెంత్ ప్లేస్ లో ఐశ్వర్య రాయ్, సమంతకు ఎయిత్ ప్లేస్ దక్కింది. సామ్ చేసిన హానీ బన్నీ సిరీస్, కమర్షియల్ యాడ్స్‌, సోషల్‌ మీడియా ఫోటోలు, అనారోగ్య సమస్యల , ఆమెకున్న పాపులారిటీ కారణంగా సామ్ గూర్చి ఎక్కువమంది సెర్చ్ చేయటంతో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. నైన్త్ ప్లేస్ లో ఆలియా భట్, ప్రభాస్ టెన్త్  ప్లేస్ లో నిలిచారు. మొత్తానికి అక్కినేని ఇంటి కోడళ్ళు ఇద్దరు మోస్ట్ పాపులర్ యాక్ట్రస్ లిస్ట్ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకోవటం గమనార్హం. ముందు నుంచి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న సామ్ ని తరవాత వచ్చిన శోభిత వెనక్కి నెట్టి టాప్ 5 లో చోటు దక్కించుకోవటం విశేషం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IMDb India (@imdb_in)

ALSO READ: సంధ్య థియేటర్‌ విషాదం: అల్లు అర్జున్‌ పై కేసు నమోదు