ENGLISH

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి కీలక పదవి

07 December 2024-10:24 AM

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుని తాజాగా మరో పదవి వరించింది. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన దిల్ రాజు ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా చెలామణి అవుతున్నారు. రాజు గారు వేసే లెక్క ఎప్పుడు తప్పలేదు. ఆయన ఏ సినిమా చేసినా సూపర్ హిట్. కథలు ఎంచుకోవటంలోనే కాదు ఎలా ప్రమోట్ చేయాలి, ఎప్పడు రిలీజ్ చేయాలి అన్న లెక్కలు పర్ఫెక్ట్ గా వేస్తూ కెరియర్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నారు. బడా హీరోలతోనే కాదు, చిన్న హీరోలతో, కొత్తవారితో కూడా సినిమాలు నిర్మించి విజయం సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

శ్రీ వెంకటేశ్వర బ్యానర్ ఉండగా 'దిల్ రాజు ప్రొడక్షన్స్' స్థాపించి చిన్న సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. ఇపుడు కొత్త వారిని ప్రోత్సహించే దిశగా 'దిల్ రాజు డ్రీమ్స్' అనే కొత్త బ్యానర్ స్టార్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తెలంగాణ గవర్నమెంట్ ఒక కీలక పదవిలో నియమించటం ఇంకో ఎత్తు. రేవంత్ సర్కార్ దిల్ రాజుని 'తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్' గా నియమించారు. రెండేళ్లు పాటు దిల్ రాజు ఈ పదవిలో ఉంటారు. ఈ సందర్భంగా సినీ,రాజకీయ ప్రముఖులు రాజు గారికి శుభాకాంక్షలు చెప్తున్నారు.

సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖతో కలిసి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వర్క్ చేస్తుంది. ఉన్నతమైన సినిమాలను ప్రోత్సహించి, పరిశ్రమ అభివృద్ధికి, విస్తరణకు ఈ పదవి ఉపయోగపడుతుంది. తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగటం, తెలుగు సినిమాలకి, హీరోలకి ప్రపంచ స్తాయి గుర్తింపు వస్తున్నఈ తరుణంలో దిల్‌రాజు నియామకం ఫిలిం ఇండస్ట్రీకి మేలు చేకూరుస్తుంది అని సినీవర్గం భావిస్తోంది. నిర్మాతగా అద్భుత విజయాలు అందుకున్న దిల్‌రాజు ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మరింత సేవ చేసి, అత్యున్నత అభివృద్ధికి పాటు పడతారని టాలీవుడ్ పెద్దలు ఆశపడుతున్నారు.