అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఫైర్ కాదు ఇంటర్నేషనల్ ఫైర్ అనేట్లుగానే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. వరల్డ్ వైడ్ పుష్ప ఫైర్ సెగలు పుట్టిస్తోంది. ఫస్ట్ డే పుష్ప 2 వరల్డ్ వైడ్‌గా 294 కోట్లు కలెక్ట్ చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. దీంతో బిగ్గెస్ట్ ఇండియన్ ఓపెనింగ్ మూవీగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు RRR 223 కోట్ల ఫస్ట్ డే కలక్షన్స్ తో టాప్ వన్ లో ఉంది. నెక్స్ట్ ప్లేస్ లో బాహుబలి సెకండ్ పార్ట్ 217 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. కానీ ఇప్పుడు పుష్ప రాజ్ నంబర్ వన్ కి చేరుకున్నాడు. అంతే కాదు హిందీలో కూడా భారీ ఓపెనింగ్ తెలుగు డబ్బింగ్ మూవీ పుష్ప 2 కావటం గమనార్హం.
నార్త్ వసూల్ లో బన్నీ షారుక్ నే మించిపోయాడు. హిందీలో షారుక్ ఖాన్ జవాన్ మూవీకి మొదటి రోజు 65.5 కోట్ల కలక్షన్ వచ్చింది. పుష్ప 2 ఫస్ట్ డే హిందీలో 72 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం ఇండియాలోనే ప్రీమియర్ షోస్ ద్వారా 10.65 కోట్లు, ఫస్ట్ డే కలక్షన్స్ ద్వారా 175 కోట్ల వచ్చాయి. రెండో రోజు పుష్ప 2 కలెక్షన్స్ 90 కోట్లు. తెలుగులో 27 కోట్లు, హిందీలో 55 కోట్లు, కర్ణాటకలో 6 కోట్లు, తమిళంలో 5.5 కోట్లు, మలయాళంలో 1.9 కోట్లు వసూల్ చేసింది. ఈ రెండు రోజుల్లో పుష్ప 2 ఇండియాలో 265 కోట్ల వసూళ్లు చేసినట్లు ట్రేడ్ పండితుల అంచనా వేస్తున్నారు.
ఫైనల్ గా పుష్ప 2 మూవీ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ స్పష్టం చేసింది. పుష్ప 2 ఓవర్సీస్‌లో మొదటి రోజు 8 మిలియన్ డాలర్స్ అంటే, 67.73 కోట్లు వసూల్ చేసింది. రెండో రోజు వరల్డ్ వైడ్ కలక్షన్స్ కలిపితే 150 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం.
ALSO READ: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి కీలక పదవి