ENGLISH

తెలుగులో ఆ న్యూడ్‌ బ్యూటీ సొగసులు

31 August 2017-13:52 PM

బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా, మోస్ట్‌ వాంటెండ్‌ సెక్సీ హీరోయిన్‌. అయితే అమ్మడికి ఆశించిన స్థాయిలో హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. కానీ సోషల్‌ మీడియాలో ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌తో రెచ్చిపోతూ, ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ న్యూస్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అవుతూ ఉంటుంది. న్యూడ్‌ ఫోటోస్‌తో సోషల్‌ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్‌ అయితే పెంచేసుకుంది ఈ హాట్‌ బ్యూటీ. బాలీవుడ్‌లో ప్రస్తుతం 'బాద్షాహో' సినిమాలో నటిస్తోంది ఇషా. హాట్‌ హాట్‌ ఫోటో షూట్స్‌తో హీటెక్కించేసే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోనూ అంతే.. ఛాన్స్‌ దొరికిందంటే చాలు ఎక్స్‌పోజింగ్‌కి అస్సలు నో చెప్పదు. ఇషా నటిస్తోన్న 'బాద్షాహో' విడుదలకు సిద్ధమయ్యింది. ఇదిలా ఉండగా అమ్మడి దృష్టి ఇప్పుడు టాలీవుడ్‌పై పడింది. సచిన్‌ జోషి హీరోగా తెరకెక్కుతోన్న 'వీడెవడు' సినిమాలో నటిస్తోంది ఈ శృంగార తార. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ సినిమాకి యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఒక ఎత్తు. ఇషా గుప్తా గ్లామర్‌ మరో ఎత్తు. థ్రిల్లింగ్‌ అంశాలతో పాటు, తన గ్లామర్‌తోనూ తెలుగు ప్రేక్షకులకి సూపర్‌ థ్రిల్‌ ఇస్తానంటోంది ముద్దుగుమ్మ ఇషా గుప్తా. అంతేకాదు ఈ సినిమా తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తానంటోంది. బాలీవుడ్‌తో పోలిస్తే, టాలీవుడ్‌లో గ్లామర్‌కి కొన్ని లిమిట్స్‌ ఉంటాయి. మరి ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌ని టాలీవుడ్‌ తట్టుకోగలదా? గ్లామర్‌ కన్నా పర్‌ఫామెన్స్‌కే పెద్ద పీట వేసే టాలీవుడ్‌లో ఇషా గ్లామర్‌ మెచ్చి అవకాశాలు ఆమెని వరిస్తాయో లేదో చూడాలి మరి.

ALSO READ: బాలకృష్ణ పైసా వసూల్ స్టొరీ లీక్?