ENGLISH

జూ.ఎన్టీఆర్‌.. రియల్‌ హీరో: నిధి అగర్వాల్‌

30 April 2019-11:00 AM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల్ని ఒక్క డైలాగ్‌తో బీభత్సంగా ఎట్రాక్ట్‌ చేసేసింది 'సవ్యసాచి', 'మిస్టర్‌ మజ్ను' చిత్రాల ఫేం నిధి అగర్వాల్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో ప్రస్తుతం రామ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న నిధి అగర్వాల్‌, సోషల్‌ మీడియా వేదికగా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో కొందరు అభిమానులు తమ అభిమాన హీరోలపై అభిప్రాయాల్ని చెప్పాల్సిందిగా నిధి అగర్వాల్‌ని కోరారు. 

 

ఈ నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేసింది నిధి. ఆమె ఏమని చెప్పిందో తెలుసా.? జూనియర్‌ ఎన్టీఆర్‌ రియల్‌ హీరో అట. 'అన్ని విషయాల్లోనూ ఆయన రియల్‌ హీరో' అని నిధి అగర్వాల్‌ చెప్పేసరికి యంగ్‌ టైగర్‌ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎంతైనా ఇస్మార్ట్‌ బ్యూటీ కదా, చాలా స్మార్ట్‌గా వ్యవహరించింది. 

 

రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నాననీ, ప్రభాస్‌ 'బాహుబలి' సినిమాతో దేశం దృష్టిని ఆకర్షించారనీ.. ఇలా నిధి, దాదాపుగా టాలీవుడ్‌ అగ్రహీరోలందరి అభిమానుల్నీ తన సమాధానాలతో ఓ రేంజ్‌లో మెప్పించేసింది. తనకు డాన్స్‌ ఇష్టమనీ, టాలీవుడ్‌లో డాన్సింగ్‌ సెన్సేషన్స్‌ అనదగ్గ హీరోలు ఎందరో వున్నారనీ, వారందరితోనూ పనిచేయాలనుకుంటున్నానని నిధి అభిప్రాయపడింది. తనకు సింగింగ్‌ టాలెంట్‌ కూడా వుందనీ, అయితే అది కేవలం నాలుగ్గోడలకే పరిమితమనీ నిధి వ్యాఖ్యానించడం గమనార్హం. 

ALSO READ: బాలీవుడ్‌కి వెళుతోన్న 'కాంచన'.!