ENGLISH

గ్లామ్‌షాట్‌: గ్లామర్‌ గనుల 'నిధి' వహ్వా.!

27 April 2019-12:30 PM

'మున్నా మైఖేల్‌' సినిమాతో బాలీవుడ్‌లో క్యూట్‌గా సినీ కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. తెలుగులో వరుసగా అక్కినేని హీరోలతో ఆడి పాడింది. 'సవ్యసాచి'తో ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత 'మిస్టర్‌ మజ్ను' అంటూ అఖిల్‌ సరసన హాట్‌ హాట్‌ స్టెప్పులేసింది. కానీ ఈ రెండు సినిమాలూ నిధికి అంతగా కలిసి రాలేదు. సక్సెస్‌తో సంబంధం లేకపోయినా నిధి అగర్వాల్‌ తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో నటిస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి పూరీ జగన్నాధ్‌ దర్శకుడు. ఈ సినిమాలో గత రెండు చిత్రాల కన్నా హాట్‌గా నిధి మెరిసిపోనుందనీ తెలుస్తోంది. 

 

సహజంగానే పూరీ జగన్నాధ్‌ సినిమాల్లో హీరోయిన్లు డిఫరెంట్‌గా, ఎక్కువ గ్లామరస్‌గా కనిపిస్తారు. అసలే గ్లామర్‌ డాళ్‌గా పేరున్న నిధి అగర్వాల్‌ని పూరీ ఇంకెంత గ్లామర్‌గా చూపించాడో కానీ, ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాల్లో నిధి హాట్‌ స్టిల్స్‌ కుర్రకారుకు కైపెక్కించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా, సోషల్‌ మీడియాలో నిధి అగర్వాల్‌ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌తో ఫాలోవర్స్‌ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అలా తాజాగా నిధి పోస్ట్‌ చేసిన పిక్‌ ఇప్పుడు నెటిజన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. 

ALSO READ: రష్మికా మండన్నా ఆ తప్పు చేస్తుందా.?