ENGLISH

జాక్వెలైన్‌ మళ్ళీ టాలీవుడ్‌కి వస్తోందట

04 September 2020-10:23 AM

శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తెలుగులో ఆమెకు ‘సాహో’నే తొలి సినిమా. అయితే, అందులో ఆమె చేసింది స్పెషల్‌ సాంగ్‌ మాత్రమే. ఇప్పుడు ఇంకోసారి జాక్వెలైన్‌ తెలుగులో సినిమా చేయబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఓ యంగ్‌ హీరో సినిమా కోసం జాక్వెలైన్‌ మళ్ళీ టాలీవుడ్‌లో అడుగు పెడుతోందట. అయితే, ఇది కూడా స్పెషల్‌ సాంగే అయి వుండొచ్చని అంటున్నారు.

 

అయితే, ఎవరా యంగ్‌ హీరో అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌ అట. టాలీవుడ్‌లో ఇప్పుడంతా పాన్‌ ఇండియా మోజులో పడ్డారు. ఏదో ఒక చిన్న ఎట్రాక్షన్‌ వుంటే, అది బాలీవుడ్‌లోనూ కాసుల వర్షం కురిపిస్తుందని నమ్ముతున్నారు. డబ్బింగ్‌ సినిమా ది¸యేటర్లలో రిలీజ్‌ కాకపోయినా, యూ ట్యూబ్‌లోనో, టెలివిజన్‌ ప్రీమియర్స్‌ రూపంలోనో వసూళ్ళు రాబట్టాలంటే.. ఇలాంటి మ్యాజిక్‌ ఏదో ఒకటి అవసరం.

 

పైగా, జాక్వెలైన్‌ అంటే బాలీవుడ్‌లో బీభత్సమైన క్రేజ్‌ వుంది. మరీ ముఖ్యంగా, జాక్వెలైన్‌ స్పెషల్‌ సాంగ్స్‌కి అక్కడు వున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఇవన్నీ ఆలోచించే, సదరు యంగ్‌ హీరో జాక్వెలైన్‌ కోసం ప్రయత్నిస్తున్నాడట. డాన్స్‌ అంటే జాక్వెలైన్‌కి కూడా బాగా ఇష్టమే. దానికి తోడు, రెమ్యునరేషన్‌ కూడా గట్టిగా వస్తుండడంతో దాదాపుగా ఆమె ఒప్పేసుకుందనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయట.

ALSO READ: వెబ్ సిరీస్ చూసి ఏడ్చేసింద‌ట‌!