ENGLISH

వెబ్ సిరీస్ చూసి ఏడ్చేసింద‌ట‌!

04 September 2020-09:13 AM

క‌ళాకారులు చాలా సెన్సిటీవ్‌. భావోద్వేగాల్ని అస్స‌లు అదుపులో పెట్టుకోలేరు. స‌మంత అయితే మ‌రీనూ. ఈమ‌ధ్య ఓ వెబ్ సిరీస్ చూసి.. ఏడ్చేసింద‌ట‌. ఆ వెబ్ సిరీసే.. `ది ఫ్యామిలీ మెన్‌`. చివ‌రి సారి అత్యంత భావోద్వేగానికి గురైంది ఎప్పుడు? అని ఓ అభిమాని అడిగితే... ``ది ఫ్యామిలీమెన్ చూసిన‌ప్పుడు.. క‌న్నీళ్లు ఆగ‌లేదు`` అని స‌మాధానం ఇచ్చింది. `ది ఫ్యామిలీ మెన్‌` అత్యంత ఆద‌ర‌ణ పొందిన వెబ్ సిరీస్‌ల‌లో ఒక‌టి. కొత్త సీజ‌న్‌లో స‌మంత కూడా న‌టిస్తోంది. స‌మంత న‌టిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇదే. ఈ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ జ‌నాల్ని ఆక‌ట్టుకోవాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉంది స‌మంత‌.

 

అన్న‌ట్టు ఈమ‌ధ్య న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల్ని ఎంచుకుంటోంది. ఓబేబీ, రంగ‌స్థ‌లం, యూ ట‌ర్న్‌లాంటి చిత్రాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. కాక‌పోతే.. న‌టిగా తానింకా ఎద‌గ‌లేదంటోంది. ఆ ప్ర‌య‌త్నాలు ఇప్పుడే మొద‌లెట్టాన‌ని చెబుతోంది. మునుముందు మ‌రిన్ని మంచి పాత్ర‌లు చేస్తాన‌న్న భ‌రోసా క‌లిగిస్తోంది స‌మంత‌.

ALSO READ: Samantha Latest Photoshoot