ENGLISH

జాతి ర‌త్నాలు... తొలి రోజు స్కోరు

12 March 2021-17:35 PM

ఈ గురువారం మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఒకేరోజు మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి.వాటిలో జాతి ర‌త్నాలు ఒక‌టి. మిగిలిన రెండు సినిమాల‌తో పోలిస్తే.. జాతిర‌త్నాల‌కే మంచి టాక్ వ‌చ్చింది. సినిమా బాగుందంటూ.. మౌత్ టాక్ పెరిగింది. దాంతో తొలి రోజే.. మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ.. తొలిరోజు 3.82 కోట్ల షేర్ ద‌క్కించుకుంది.

 

నైజాంలో 1.45 కోట్లు

సీడెడ్‌లో 55 లక్ష‌లు

గుంటూరులో 39 ల‌క్ష‌లు

ఈస్ట్ లో 31 లక్ష‌లు

వెస్ట్ లో 28 ల‌క్ష‌లు

కృష్ణ‌లో 25 ల‌క్ష‌లు

నెల్లూరులో 11 ల‌క్ష‌లు

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి దాదాపు 11 కోట్ల బిజినెస్ జ‌రుపుకుంది. ఈ ఆదివారానికి బ్రేక్ ఈవెన్ లో ప‌డ‌డం ఖాయంగా అనిపిస్తోంది. జాతి ర‌త్నాలు జోరు మ‌రో వారం రోజుల వ‌ర‌కూ ఉండొచ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే.. లాభాల బాట ప‌ట్టిన‌ట్టే.

ALSO READ: ఒకే నెల‌లో ఫినిష్ చేస్తార్ట‌