ENGLISH

'ధడక్‌'లో జాన్వీ అదరగొట్టేసింది.!

19 July 2018-18:21 PM

మరాఠీ చిత్రం 'సైరత్‌' మూవీకి హిందీ రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం 'ధడక్‌'. అతిలోకసుందరి శ్రీదేవి గారాల పట్టీ జాన్వీ కపూర్‌ ఈ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్‌కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ ఖత్తర్‌ హీరోగా నటిస్తున్నాడు. శశాంక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.  

తాజాగా చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్‌ షో నిర్వహించింది. ఈ స్పెషల్‌ షోలో సోనమ్‌ కపూర్‌, వరుణ్‌ధావన్‌, అనిల్‌ కపూర్‌, కరణ్‌జోహార్‌ తదితరులు సినిమాని వీక్షించారు. సినిమా చూసిన వీరంతా స్క్రీన్‌పై జాన్వీ ఇంట్రడక్షన్‌ని చూసి షాకయ్యారట. అసలు ఫస్ట్‌ మూవీ అనే డిఫరెన్స్‌ లేకుండా ఎంతో అనుభవం ఉన్న నటిలా తెరపై కనిపించింది జాన్వీ అని ఆమెను పొగడ్తలతో ముంచెత్తేశారు. హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌నీ, యాక్షన్‌ సీక్వెన్సెస్‌నీ చాలా చక్కగా డీల్‌ చేశాడు దర్శకుడు అని యూనిట్‌కి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. 

టాలెంట్‌ ఉంటే ఎన్నో సినిమాలు చూడనవసరం లేదు. ఒక్క సినిమా చాలు. అదే శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్‌ కూడా తన టాలెంట్‌ని ఈ ఒక్క సినిమాతో నిరూపించేసుకుందనిపిస్తోంది. అందంలోనూ, నటనలోనూ తల్లి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుందంటూ కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయి చూడాలి మరి అసలు సిసలు అగ్గి పరీక్షలో జాన్వీ ఎన్ని మార్కులు వేయించుకుంటుందో. 

ఇకపోతే ఈ సినిమా చూడాలని బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లోనూ ఈగర్‌గానే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాలకు టాలీవుడ్‌లో కూడా మంచి ఆదరణ దక్కుతోంది. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీలా రూపొందుతోన్న 'ధడక్‌' కోసం తెలుగు ఆడియన్స్‌ కూడా వెయిట్‌ చేస్తున్నారు.
 

 

ALSO READ: బిగ్ బాస్ సభ్యులకి, వీక్షకులకి షాక్ ఇచ్చిన ప్రదీప్