ENGLISH

రిలీజ్ డేట్ తో స‌హా వ‌చ్చేశారు

13 April 2021-11:00 AM

స్టార్ హీరో సినిమా అంటే.. అభిమానుల‌కు పండ‌గే. కానీ.. నిర్మాత‌ల‌కు, ద‌ర్శ‌కుల‌కు అదో తెలియ‌ని భారం. సినిమా మొద‌లెట్టేంత వ‌ర‌కూ త‌మ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు బ‌య‌ట‌కు తీసుకొస్తారో చెప్ప‌లేని ప‌రిస్థితి. రిలీజ్ డేట్ విష‌యంలో క్లారిటీ ఉండ‌దు. ప‌లుమార్లు... వాయిదా వేయాల్సివ‌స్తుంటుంది. పాన్ ఇండియా... అనే భారం ఉంటే, అది ఇంకాస్త క‌ష్టం అవుతుంది.

 

అయితే ఎన్టీఆర్ - కొర‌టాల శివ మాత్రం షాక్ ఇచ్చారు. త‌మ త‌దుప‌రి సినిమాకి రిలీజ్ డేట్ ముందే ప్ర‌క‌టించేశారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నుంద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించేశారు. ప్ర‌క‌టన‌తో పాటు.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. ఏప్రిల్ 29, 2022న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు చెప్పేశారు.

 

అంటే 2022 వేస‌వికి.. ఈ సినిమాని చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌, ప్ర‌స్తుతం ఆచార్య‌తో బిజీగా ఉన్నాడు కొర‌టాల‌. ఆర్‌.ఆర్‌.ఆర్ తో ఎన్టీఆర్ బిజీ. ఇవి రెండూ అయ్యాకే.. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. జూన్ రెండో వారంలో.. ఈ సినిమా ప‌ట్టాలెక్కొచ్చు.

ALSO READ: ఆచార్య‌కీ త‌ప్ప‌ని క‌ష్టాలు.. రిలీజ్ వాయిదా?