ENGLISH

ట్రైల‌ర్ .. సినిమా... రెండూ లేటు గానే!

13 April 2021-09:00 AM

అనుకున్న‌దే అయ్యింది. ఈ నెల‌లో విడుద‌ల కావ‌ల్సిన `ట‌క్ జ‌గ‌దీష్` విడుద‌ల వాయిదా ప‌డింది. నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. ఈనెల 23న ఈ సినిమా రావాలి. కానీ క‌రోనా భ‌యాల నేప‌థ్యంలో ఈ సినిమావిడుద‌ల వాయిదా వేశారు. ఈ నెల 16న రావాల్సిన `ల‌వ్ స్టోరీ` ముందే వాయిదా ప‌డింది. ట‌క్ జ‌గ‌దీష్ కూడా అదే దారిలో వెళ్ల‌బోతోంద‌ని ముందే ఊహించారు. ఇప్పుడు అదే నిజ‌మైంది. ఈ సినిమాని కాస్త ఆల‌స్యంగా విడుద‌ల చేస్తున్న‌ట్టు... నాని చెప్పేశాడు.

 

క‌రోనా భ‌యాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, ట‌క్ జ‌గ‌దీష్ కుటుంబం మొత్తం హ్యాపీగా చూడాల్సిన సినిమా అని, అందుకే ఈ సినిమాని ప్ర‌స్తుతానికి వాయిదా వేస్తున్నామ‌ని ఓ వీడియో సందేశంలో చెప్పాడు నాని. నిజానికి ఉగాది సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ట‌క్ జ‌గ‌దీష్ ట్రైల‌ర్ విడుద‌ల కావాలి. ఇప్పుడు దాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు. ట్రైల‌ర్ ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌స్తుందో, అప్పుడే రిలీజ్ డేట్ కూడా చెబుతామ‌ని నాని క్లారిటీ ఇచ్చాడు. సో.. ట‌క్... రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియాలంటే.. ఆ సినిమా ట్రైల‌ర్ బ‌య‌ట‌కు రావాల‌న్న మాట‌.

ALSO READ: ఆచార్య‌కీ త‌ప్ప‌ని క‌ష్టాలు.. రిలీజ్ వాయిదా?