ENGLISH

'ఆర్‌ఆర్‌ఆర్‌' అప్‌డేట్‌: ఎన్టీఆర్‌కి ఒక్కరు కాదు ముగ్గురట.?

30 April 2019-15:30 PM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మల్టీ స్టారర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూడు వారాల గ్యాప్‌ తర్వాత మళ్లీ సెట్స్‌ పైకెళ్లింది. మూడు వారాల గ్యాప్‌ రావడంతో డేట్స్‌ అడ్జస్ట్‌ కాని కారణంగా విదేశీ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోవడంతో ఈ సినిమాకి హీరోయిన్‌ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే.

 

ఇంకా ఈ ప్లేస్‌ని ఫుల్‌ ఫిల్‌ చేసే హీరోయిన్‌ పేరు తెరపైకి రాలేదు. ఇదిలా ఉంటే, తాజాగా అందుతోన్న సమాచారమ్‌ ప్రకారం కొమరంభీమ్‌ పాత్ర పోషిస్తోన్న ఎన్టీఆర్‌కి ముగ్గురు భార్యలట.. అనే కథ చరిత్రలో ఉందనీ, మరి ఈ సినిమాలో ఆ ముగ్గురి భార్యలనూ చూపిస్తారా.? లేదా.? అనే అనుమానాలు మొదలయ్యాయి. 

 

అయితే ఒక్క హీరోయిన్‌ని వెతకడమే ఇంత కష్టంగా మారింది. మరి ముగ్గురు భామల్ని ఇంకెక్కడి నుండి పట్టుకొస్తారో కదా మరి. అయితే ముగ్గురి పాత్రల్నీ ఈ సినిమాలో చూపించరనీ, విదేశీ భామతో కొమరం భీమ్‌ ప్రేమ వ్యవహారాన్ని మాత్రమే కీలకంగా చూపిస్తారనీ, అందుకే ఆ పాత్ర విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్‌. 

 

అయితే నిత్యామీనన్‌ ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. నిత్యా పాత్ర కూడా కొమరం భీమ్‌కి లింక్‌ అప్‌ అయ్యే ఉంటుందట. మరోవైపు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న చరణ్‌ కోసం అలియా భట్‌ సిద్ధంగా ఉంది. అల్లూరి ప్రియురాలు, భార్య అయిన సీత పాత్రలో అలియా నటిస్తోంది. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

ALSO READ: అక్కినేని బుల్లోడు ఈ సారి సిక్స్‌ ప్యాక్‌ పక్కా.!