ENGLISH

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొంటున్న ఎన్టీఆర్..?

08 September 2017-13:15 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'జై లవకుశ'. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే కావటం విశేషం. ఎన్టీఆర్ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేవి అతని నటన, డాన్స్ లు. ఇప్పుడు అవే కాకుండా త్రివిక్రమ్ సినిమాలో 'మార్షల్ ఆర్ట్స్' తో ఫాన్స్ ని అలరించనున్నాడు.

త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా థాయ్ లాండ్, ఇండోనేషియా స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇందుకోసం తారక్ అక్కడికి వెళుతున్నట్లు తెలుస్తుంది. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

ప్రస్తుతం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా 'జై లవకుశ' చిత్రం తో పాటు, అటు 'బిగ్ బాస్' షో తో కూడా బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తి కాగానే ఈ సినిమా ప్రారంభం కావచ్చని తెలుస్తుంది.

ALSO READ: 'కుశ' వచ్చేశాడు - కుమ్మేశాడు!