ENGLISH

జూనియ‌ర్ ఆర్టిస్టుని ప‌ట్టుకుని.. హీరోయిన్ అంటారా?

05 January 2021-15:32 PM

డ్ర‌గ్స్ కేసుతో మ‌రోసారి టాలీవుడ్ ఉలిక్కి ప‌డింది. ముంబైలో.. ఓ క‌థానాయిక డ్ర‌గ్స్‌తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింద‌ని, ఆమె ద‌గ్గ‌ర నుంచి 400 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నార‌ని, ఆమె ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోయిన్ అని... దిన ప‌త్రిక‌లు, ఛాన‌ళ్లూ.. హోరెత్తించాయి. దాంతో.. ఆ హీరోయిన్ ఎవ‌రా? అనే ఆస‌క్తి నెల‌కొంది అంద‌రిలో. ఇటీవ‌ల టాలీవుడ్ కి చెందిన కొంత‌మంది డ్ర‌గ్స్ కేసులో ఇన్‌వాల్వ్ అవ్వ‌డంతో.. వాళ్ల‌పైనే మ‌రోసారి అనుమానాలు వ్యాపించాయి.

 

అయితే.. ఆమె తెలుగు హీరోయిన్ కాదు. జ‌స్ట్.... జూనియ‌ర్ ఆర్టిస్టు అంతే. కేవ‌లం నాలుగైదు సినిమాలు చేసింది. త‌న పేరు... శ్వేతా కుమారి. టాలీవుడ్ లో ఏ ఒక్క‌రూ ఆమెను గుర్తు ప‌ట్ట‌రు. అలాంటి న‌టిని ప‌ట్టుకుని.. తెలుగు హీరోయిన్ అంటూ ప్ర‌చారం మొద‌లెట్టారు. నేష‌న‌ల్ మీడియా కూడా ఇలానే ప్ర‌చారం చేసింది. వాళ్ల‌కేం.. పైత్య‌మో మ‌రి. జూనియ‌ర్ ఆర్టిస్టు దొరికిందంటే.. దానిపై జ‌నాలు ఫోక‌స్ చేయ‌రు అనుకున్నారేమో..? మొత్తానికి డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో టాలీవుడ్ మ‌ళ్లీ ఉలిక్కి ప‌డినా, పెద్ద‌వాళ్ల పేర్లు లేక‌పోవ‌డంతో కాస్త ఊపిరి పీల్చుకున్న‌ట్టైంది.

ALSO READ: పీక‌ల్లోతు అప్పుల్లో... హీరో! ఎవ‌రో తెలుసా?